Gossip Garage: పద్ధతి మార్చుకోండి, ఇక ప్రజల్లోకి వెళ్లండి.. ఎమ్మెల్యేలకు బిగ్ టాస్క్.. అసలు చంద్రబాబు స్ట్రాటజీ ఏంటి?

జులై ఫస్ట్‌ నుంచి ఎమ్మెల్యేలు ఇంటింటికీ తిరగాల్సిందేనంటూ పెద్ద టార్గెటే ఇచ్చారు చంద్రబాబు. రెండు నెలల పాటు ప్రజ‌ల మ‌ధ్య ఉండాల‌ని దిశానిర్దేశం చేశారు.

Gossip Garage: పద్ధతి మార్చుకోండి, ఇక ప్రజల్లోకి వెళ్లండి.. ఎమ్మెల్యేలకు బిగ్ టాస్క్.. అసలు చంద్రబాబు స్ట్రాటజీ ఏంటి?

Updated On : June 25, 2025 / 7:58 PM IST

Gossip Garage: పవర్‌లోకి వచ్చి ఏడాది అయింది. వన్ ఇయర్ పాలన కూడా కంప్లీట్ చేసుకున్నామ్. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్‌ సిక్స్‌లో మెజార్టీ స్కీమ్స్ ల్యాండ్ చేశాం. ఇంకా ఒకటి రెండు పథకాలు బాకీ ఉంటే.. వన్‌ మంత్ లో అవి కూడా ఇంప్లిమెంట్‌ అయిపోతుంటాయ్. ఇక ప్రజల్లోకి పదండి. చేసిన మంచిని చెబుదాం అంటూ ఎమ్మెల్యేలకు బిగ్ టాస్క్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఎంతో చేస్తున్నా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యామంటూ చురకలు అంటిస్తున్నారు. చంద్రబాబు స్ట్రాటజీ ఏంటి? ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉంటే ఇంకా మైలేజ్ వస్తుందని భావిస్తున్నారా?

మారండి. నిత్యం ప్రజల్లో ఉండండి. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లండి. ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా..మీ పొలిటికల్‌ ఫ్యూచర్‌ బాగుండాలన్నా..పద్దతి మార్చుకోండి. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు ఇస్తున్న అలర్ట్ ఇది. అందుకు తగ్గట్లే ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా ఎమ్మెల్యేలకు బిగ్ టాస్క్ ఇచ్చారు.

ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ పోతున్నామ్. ఇలా చేయడం దేశ చరిత్రలోనే ప్రథమం. అయినా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నామ్. జులై ఫస్ట్‌ నుంచి ఎమ్మెల్యేలు ఇంటింటికీ తిరగాల్సిందేనంటూ పెద్ద టార్గెటే ఇచ్చారు చంద్రబాబు. రెండు నెలల పాటు ప్రజ‌ల మ‌ధ్య ఉండాల‌ని దిశానిర్దేశం చేశారు. ప్రజ‌ల‌కు ప్రభుత్వం అందిస్తున్న సేవ‌లు, చేస్తున్న సంక్షేమం, ఇస్తున్న ప‌థ‌కాలు.. ప‌నితీరు ఇలా.. అన్నింటిపై జనాలకు వివ‌రించాల‌ంటున్నారు బాబు.

ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ జనంలోకి వెళ్లి ప్రజ‌ల‌కు ప్రభుత్వం అందిస్తున్న ప‌థ‌కాల‌ను వివ‌రించాల‌ని టాస్క్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. అంతేకాదు.. గ‌త ఐదేళ్ల పాల‌న‌కు.. ప్రస్తుత కూట‌మి పాల‌న‌కు మ‌ధ్య తేడాల‌ను చూపించాల‌ని త‌మ్ముళ్లకు తేల్చి చెప్పారు. ఈ ఏడాదిలో ప్రజ‌ల‌కు జ‌రిగిన ల‌బ్ధి, వారు పొందుతున్న ప‌థ‌కాలు, సంక్షేమంపై ఆధార‌ప‌డిన కుటుంబాలు.. ఇలా అన్ని వివ‌రాల‌ను తెలుసుకోవాల‌ని నిర్ణయించారు. దీని ఆధారంగానే ఎమ్మెల్యేల‌కు మార్కులు ఉంటాయ‌న్నది ప్ర‌స్తుతం టీడీపీలో జ‌రుగుతున్న చ‌ర్చ.

ఇంటి నుంచే కాలం గ‌డిపే ఎమ్మెల్యేలకు.. ఇది పెద్ద టాస్కే..!
చంద్రబాబు ఎమ్మెల్యేలను అలర్ట్ చేస్తూ వస్తున్నారు. అంద‌రూ వింటున్నారు. కానీ పనుల్లో బిజీగా ఉండిపోతున్నారట. దీంతో జనం మధ్యలో ఉండాల్సిందేనని కండీషన్ పెట్టారు చంద్రబాబు. వెబ్‌సైట్‌లో ఫొటోలు, ఆధారాల‌ను కూడా పొందు ప‌రిచే కాల‌మ్‌ను ఏర్పాటు చేస్తారట. అంటే.. ఎమ్మెల్యేలు ఎక్కడా త‌ప్పించుకోకుండా కచ్చితంగా ప్రజ‌ల‌ను క‌లుసుకుని తీరాల్సిన ప‌రిస్థితిని క్రియేట్ చేస్తున్నారు. ప్రజ‌ల దగ్గరకు వెళ్లకుండా.. ఇంటి నుంచే కాలం గ‌డిపే ఎమ్మెల్యేలకు..ఇది పెద్ద టాస్కేనని చెప్పొచ్చు.

Also Read: సింగయ్య మృతి ఘటన.. బల ప్రదర్శన యాత్రల వల్లే ప్రమాదాలు, జగన్ పర్యటనలను నిషేధించాలి- షర్మిల సంచలన వ్యాఖ్యలు

సూపర్ సిక్స్ హామీల్లో తల్లికి వందనంతో అతిపెద్ద హామీని నెరవేర్చారు. నెక్స్ట్ అన్నదాత సుఖీభవ కూడా ఇంకో మూడు నాలుగు రోజుల్లోనే అమలయ్యే అవకాశం ఉంది. ఇక పంద్రాగస్ట్‌ నుంచి ఫ్రీ బస్ స్కీమ్‌ ఇంప్లిమెంట్ చేస్తామని డేట్‌ కూడా అనౌన్స్ చేశారు. దీంతో సూపర్‌ సిక్స్ పథకాల్లో ఆల్‌మోస్ట్‌ అన్నీ స్కీమ్స్ ల్యాండ్ అయిన సిచ్యువేషన్‌లో పబ్లిక్‌ దగ్గరకు వెళ్తే..ప్రభుత్వానికి మైలేజ్ వస్తుందని భావిస్తున్నారట చంద్రబాబు. అంతేకాదు ప్రభుత్వం ఎంతిస్తున్నా..ప్రభుత్వ అధినేతల మీద ఎంత నమ్మకం ఉన్నా..లోకల్‌గా ఎమ్మెల్యేల పనితీరు కూడా ముఖ్యమనేది బాబుకు ఎప్పటినుంచో తెలుసు.

ఎన్ని పాట్లు పడ్డా జగన్‌ తిరిగి అధికారంలోకి రాలేకపోయారు..
వైసీపీ పవర్‌లో ఉన్నప్పుడు ప్రజలకు అప్పటి సర్కార్‌ స్కీమ్‌ల కింద విరివిగా డబ్బులు ఇచ్చామని చెప్పుకున్నా..ఎమ్మెల్యేల పనితీరే వైసీపీ ఓటమికి ప్రధాన కారణమన్న మాట కూడా ఉంది. పైగా ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉందని..క్యాండిడేట్లను మార్చి.. ఇక్కడి అభ్యర్థులను అక్కడికి..అక్కడి క్యాండిడేట్లను ఇక్కడికి మార్చి ఎన్ని పాట్లుపడ్డా జగన్‌ తిరిగి అధికారంలోకి రాలేకపోయారు.

పనితీరు మార్చుకోకపోతే చర్యలు..?
ప్రభుత్వం చేసే మంచి ఎలాగూ చేస్తుంది. పబ్లిక్‌తో ఎమ్మెల్యేల అటాచ్‌మెంట్‌ కూడా చాలా ముఖ్యం. దానికోసమే క్యాడర్‌కు, సాధారణ జనాలకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట చంద్రబాబు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా కాకుండా..చివరి నిమిషంలో అభ్యర్థులు మార్పులు చేర్పులు చేసే బదులు ఇప్పటి నుంచే ఎమ్మెల్యేలను సెట్‌రైట్‌ చేసే ప్లాన్ చేస్తున్నారట. కాదు కూడదని ఎవరైనా ఎమ్మెల్యే పనితీరు మార్చుకోకపోతే తప్పదనుకుంటే కొందరిని మార్చి ఎన్నికలకు వెళ్తారట. అందుకే ప్రత్యేకంగా కూటమి నుంచి ఫస్ట్‌ టైమ్‌ గెలిచిన దాదాపు 40 మంది ఎమ్మెల్యేలకు ఈ విషయం అర్థమయ్యేందుకే ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమానికి పిలుపునిచ్చారట ఏపీ సీఎం.

ఒక్కో పథకం ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోవడమే కాదు..ఎప్పటికప్పుడు చేసిన మంచిని చెప్పుకోవడం కూడా ఇంపార్టెంటే అని భావిస్తున్నారట చంద్రబాబు. ప్రజల దృష్టి మిగతా ప్రచారాలవైపు మళ్లకుండా.. ప్రభుత్వం ఇస్తున్న పథకాలు..మారిన పాలన తీరును గుర్తుకు చేయాలని..అప్పుడు ప్రజలు మిగతా పార్టీల వైపు ఆలోచించారని స్కెచ్ వేశారట. చంద్రబాబు ఎమ్మెల్యేలకు ఇచ్చిన టాస్క్‌ ఎంతవరకు సక్సెస్ అవుతుందో..? బాబు అనుకున్న ఫలితాలను తీసుకొస్తుందో లేదో చూడాలి.