Gossip Garage: మాజీమంత్రి కొడాలి నాని ఎక్కడ..? అమెరికా వెళ్లక ముందే అరెస్ట్ చేస్తారా..?

ఈలోపు అనారోగ్యాన్ని కారణంగా చూపి అమెరికా ఫ్లైట్ ఎక్కబోతున్నారంటూ గాసిప్స్ గుప్పుమన్నాయి. మరింత మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Gossip Garage: మాజీమంత్రి కొడాలి నాని ఎక్కడ..? అమెరికా వెళ్లక ముందే అరెస్ట్ చేస్తారా..?

Kodali Nani

Updated On : May 24, 2025 / 7:38 PM IST

Gossip Garage: మాజీ మంత్రి కొడాలి నాని ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. ఆయనపై సడెన్‌గా లుకౌట్ నోటీసులు ఎందుకు జారీ చేసినట్టు.. ఏపీ పోలీసులు కొడాలి నాని అరెస్ట్‌కు రంగం చేస్తున్నారా..? ఈలోపు ఆయన అమెరికాకు వెళ్లాలని చూస్తున్నారా..

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రులు కొడాలి నాని, వల్లభనేని వంశీ టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు సంధించే వారు. మైక్ దొరికితే చాలు టీడీపీని విమర్శలతో ముంచెత్తే వారు. కానీ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లపై పాత కేసుల్ని తోడుతోంది. ఇప్పటికే వల్లభనేని వంశీ లాంటి నేతల్ని జైలుకు పంపించింది.

వల్లభనేని అరెస్ట్ తర్వాత కొడాలి నాని అరెస్ట్ తప్పదంటూ తెగ ప్రచారం జరిగింది. ఈలోపు కొడాలి నానికి గుండెకు సంబంధింత సమస్యలతో ముంబైలోని అస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. పూర్తిగా కోలుకున్నాక హైదరాబాద్‌ తిరిగి వచ్చేశారు. ఇక అప్పటి నుంచి కొడాలి నాని అరెస్ట్ తప్పదంటూ పొలిటికల్ సర్కిళ్లల్లో తెగ ప్రచారం జరుగుతోంది. కొడాలి నాని అరెస్ట్‌కు పోలీసులు రంగం చేస్తున్నారంటూ ఎప్పటి నుంచో గాసిప్స్ గుప్పుమంటున్నాయి.

Also Read: రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు థ్యాంక్యూ.. సినీపరిశ్రమపై డిప్యూటీ సీఎం కౌంటర్.. ఇకపై డైరెక్ట్ గా ఎవరూ కలవద్దు..

జగనన్న కాలనీకి మెరక పేరుతో కోట్ల రూపాయలు దోపిడీ..!
కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలో నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. వలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించడం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన, విశాఖపట్నంలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి నాని ముందస్తు బెయిల్‌ పొందారు. తాజాగా గుడివాడ మండలం మల్లాయిపాలెం జగనన్న కాలనీకి మెరక పేరుతో కోట్ల రూపాయలు దోపిడి చేసిన కేసులో నానిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇన్ని కేసులు ఉండడంతో నెక్ట్స్ కొడాలి నాని వంతు వచ్చేసిందని ఏపీ రాజకీయాల్లో చర్చ సాగుతోంది.

అనారోగ్య సమస్యల పేరుతో అమెరికా వెళ్లేందుకు ప్రయత్నాలు..
ఈలోపు అనారోగ్యాన్ని కారణంగా చూపి అమెరికా ఫ్లైట్ ఎక్కబోతున్నారంటూ గాసిప్స్ గుప్పుమన్నాయి. మరింత మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కొడాలి నాని అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ జరుగుతుండటంతో ఆయన కదలికలపై నిఘా పెట్టాలని టీడీపీ ఫిర్యాదు చేసింది.

కొడాలి నాని అనారోగ్య సమస్యల పేరుతో అమెరికా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. ఆయన పాస్‌పోర్టును సీజ్‌ చేయాలని కోరారు. ఈ క్రమంలో కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఏపీ పోలీసులు. ఆయన దేశం విడిచి వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు ఏపీ పోలీసులు. ఈ నోటీసులు ఆన్‌లైన్‌ విధానం ద్వారా అన్ని ఎయిర్‌ పోర్టులు, ఓడరేవులకు అందాయి.

కొడాలి నానికి పాస్ పోర్ట్ ఉందా?
లుకౌట్ నోటీసులు జారీ తర్వాత అసలు కొడాలి నానికి పాస్‌పోర్టు ఉందా లేదా అనే కొత్త గాసిప్స్ మొదలయ్యాయి. నిజానికి 2019లో నాని పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయనపై పలు కేసులు ఉండడంతో తిరస్కరించారు. గత ప్రభుత్వ హయాంలో పాస్‌ పోర్టు వచ్చిందేమోనని రికార్డులు చూస్తే, ఆయనకు పాస్‌పోర్టు లేదని పోలీసులు గుర్తించారట.

దీని కోసం రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయానికి వివరాలు కోరుతూ లేఖ రాసినట్లు సమాచారం. హైదరాబాద్‌ చిరునామాతో కొడాలి నాని పాస్‌పోర్టును పొంది ఉంటారేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అదే నిజమైతే కొడాలి నాని ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోవచ్చు. ఈలోపు ముందస్తు జాగ్రత్తగా లుకౌట్ నోటీసులు జారీ చేశారట పోలీసులు.

కొడాలి నానిపై లుక్ అవుట్ నోటీసులు జారీ కావడంతో ఆయన అరెస్ట్ ఖాయమైందని ప్రచారం ఊపందుకుంది. మరి పోలీసులు ఏ కేసులో అరెస్ట్ చేస్తారనేది క్లారిటీ లేదు.