Pawan Kalyan: ఏపీ రాజకీయాల్లో భీమవరం పేకాట పంచాయితీ.. పవన్‌ కల్యాణ్ ఆగ్రహానికి కారణమైన ఆ ఎమ్మెల్యే ఎవరు?

పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండగా.. భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం నుంచి జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Pawan Kalyan: ఏపీ రాజకీయాల్లో భీమవరం పేకాట పంచాయితీ.. పవన్‌ కల్యాణ్ ఆగ్రహానికి కారణమైన ఆ ఎమ్మెల్యే ఎవరు?

Updated On : October 22, 2025 / 9:32 PM IST

Pawan Kalyan: పేకాట పంచాయితీ.. ఏపీ పాలిటిక్స్‌లో చర్చకు దారితీసింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య తీరుపై వచ్చిన ఫిర్యాదుల మీద..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. భీమవరం డీఎస్పీ పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోతున్నాయని పవన్‌ దృష్టికి వచ్చిందట. ఇదే ఇష్యూపై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి, భీమవరం డీఎస్పీ వ్యవహార శైలిపై పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని పవన్ ఆదేశించారు.

సేమ్‌టైమ్ భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను రాష్ట్ర హోంశాఖ మంత్రికి, రాష్ట్ర డీజీపీకి తెలియజేయాలని అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగా వాళ్లిద్దరికి సమాచారం చేరవేసినట్లు పవన్‌ ఆఫీస్ చెబుతోంది. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా ఈ ఇష్యూపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించడం చర్చనీయాంశంగా మారింది. భీమవరం డీఎస్పీ వ్యవహారంపై స్పందించిన రఘురామ..జూదంపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని..పవన్ కల్యాణ్ ఆయన శాఖతో పాటు మిగిలిన శాఖలపై కూడా దృష్టి పెట్టడం సంతోషకరమన్నారు.

పేకాట శిబిరాల నిర్వహణపై ఫిర్యాదులు వెల్లువ..

డిప్యూటీ సీఎం పవన్ కార్యాలయానికి ఇటీవల పలు జిల్లాల నుంచి పేకాట శిబిరాల నిర్వహణపై ఫిర్యాదులు వెల్లువెత్తాయట. దీంతో పేకాట వ్యవహారంపై పవనే స్వయంగా ఆరా తీశారు. పేకాట శిబిరాలపై డీజీపీ నుంచి పూర్తి నివేదిక కోరారు. అయితే పవన్‌ కోపం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేపైనే అన్న టాక్ నడుస్తోంది. ఓ డీఎస్పీ స్థాయి అధికారిపై పవన్ ఫోకస్ చేయడం వెనుక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే చర్చ జరుగుతోంది.

కూటమిలో ఓ కీలక ఎమ్మెల్యే తీరు వల్లే పవన్ అలా రియాక్ట్ అయ్యారని అంటున్నారు. భీమవరం పోలీసు సబ్ డివిజన్ పరిధిలో పేకాట శిబిరాలపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని..పార్టీ నేతల ద్వారా పవన్‌ భీమవరం డీఎస్పీ జయసూర్యకు చెప్పించారట. అయితే పవన్ చెప్పినప్పటికీ డీఎస్పీ చర్యలు తీసుకోలేదట. డీఎస్పీ పవన్ ఆదేశాలను లైట్ తీసుకోవడానికి..కూటమిలోని ఓ ఎమ్మెల్యే కారణమంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే పవన్ కోపానికి కారణమంటున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండగా.. భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం నుంచి జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక టీడీపీ నుంచి ఉండిలో రఘురామకృష్ణరాజు, ఆచంటలో పితాని సత్యనారాయణ, తణుకులో రాధాకృష్ణ, పాలకొల్లులో మంత్రి రామానాయుడు ఉన్నారు. అయితే ఈ ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే..పవన్ కోపానికి కారణమయ్యారనే టాక్ వినిపిస్తోంది. భీమవరం డీఎస్పీ జయసూర్యను బదిలీ చేసినప్పటికీ సదరు ఎమ్మెల్యే ఆ ట్రాన్స్‌ఫర్‌ను ఆపించారట. దీంతో డీఎస్పీ జయసూర్య పూర్తిగా ఆ ఎమ్మెల్యే కంట్రోల్‌లో పనిచేస్తున్నారట. ఇదే విషయం పవన్ దృష్టికి రావడంతో డీఎస్పీపై విచారణకు ఆదేశించారు.

పవన్ కల్యాణ్ ఆగ్రహానికి కారణమైన ఆ ఎమ్మెల్యే ఎవరు?

అయితే సేనాని ఆగ్రహానికి కారణమైన ఆ ఎమ్మెల్యే ఎవరన్నదే ఇప్పుడు ఆసక్తికర చర్చ. ఏడుగురు ఎమ్మెల్యేల్లో మంత్రి నిమ్మల రామానాయుడుపై పవన్‌కు సాఫ్ట్ కార్నర్ ఉన్నట్లు చెబుతున్నారు. ముగ్గురు జనసేన ఎమ్మెల్యేలపైనా డిప్యూటీ సీఎంకి ఫిర్యాదులు లేవనే అంటున్నారు. ఇక టీడీపీకి చెందిన డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు, మాజీమంత్రి పితాని సత్యనారాయణ, తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణల్లో ఎవరో ఒకరు పవన్ కోపానికి కారణంగా చెబుతున్నారు. అయితే ఈ ముగ్గురితోనూ పవన్‌కు సత్సంబంధాలే ఉన్నాయని అంటున్నారు. అలాంటప్పుడు పవన్ ఆగ్రహం ఎవరి మీద అన్నదే అందరిలో వ్యక్తమవుతున్న ప్రశ్న.

భీమవరం డీఎస్పీ జయసూర్య ఓ మంచి అధికారి అంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. జయసూర్య గురించి పవన్‌కు ఎవరేం చెప్పారో తనకు తెలియదన్నారు రఘురామ. పేకాటపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని..కొంతకాలంగా భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో జూదాలు జరగడం లేదని రఘురామ కృష్ణరాజు చెప్పడం కొసమెరుపు.

Also Read: ఆ సీటుపై మెగా బ్రదర్‌ ఫోకస్..! వచ్చే ఎన్నికల్లో నాగబాబు పోటీ అక్కడి నుంచేనా?