AP Curfew: ఏపీలో కరోనా తగ్గుముఖం.. కర్ఫ్యూ కంటిన్యూ..!

సెకండ్‌ వేవ్ విజృంభణలో చాలా రోజులు 20 వేలకు పైగా కేసులు వచ్చాయి ఏపీలో. ఇప్పుడు 14 వేల లోపు కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు వంద మందికి పైగా చనిపోతున్నారు.

AP Curfew: ఏపీలో కరోనా తగ్గుముఖం.. కర్ఫ్యూ కంటిన్యూ..!

Government Covid 19 Curfew To Continue In Andhra Pradesh

Updated On : May 30, 2021 / 8:47 AM IST

AP Curfew: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 13 వేల 756 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 79వేల 564 మందికి పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో 104 మంది మృతి చెందారు. అదే సమయంలో 20 వేల 392 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

ఇప్పటికే రాష్ట్రంలో అమల్లో ఉన్న కర్ఫ్యూ రేపటితో ముగియనుండగా.. రేపు కోవిడ్‌పై సీఎం జగన్ సమీక్ష చేయనున్నారు. కర్ఫ్యూ పొడిగింపునకే సర్కార్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కనీసం రెండు వారాల పాటు కర్ఫ్యూను పొడిగించాలని సర్కార్ ఆలోచిస్తుంది. కొన్ని రోజులుగా ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో కర్ఫ్యూను కంటిన్యూ చేయాలని ప్రభుత్వ యంత్రాంగం భావిస్తోంది. దీంతో కరోనా పూర్తిగా కంట్రోల్‌లోకి వస్తుందని ఆశిస్తోంది.

సెకండ్‌ వేవ్ విజృంభణలో చాలా రోజులు 20 వేలకు పైగా కేసులు వచ్చాయి ఏపీలో. ఇప్పుడు 14 వేల లోపు కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు వంద మందికి పైగా చనిపోతున్నారు. దీంతో కర్ఫ్యూ కంటిన్యూ చేస్తూనే కరోనా కట్టడి చర్యలు చేపట్టాలని భావిస్తుంది ప్రభుత్వం.