Guntur : గుంటూరులో కలకలం.. ఏటీఎంల నుంచి కోటి 12 లక్షల రూపాయలు మాయం
నాలుగైదు నెలలుగా మంగళగిరి ప్రాంతంలో ఏటీఎంలలో నగదు ఉంచే సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. Guntur

Guntur
Guntur – CMS : గుంటూరు జిల్లా మంగళగిరి సీఎంఎస్ ఏజెన్సీ ఏటీఎంలలో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కోటి 12లక్షలు అపహరించారు. అయితే, ఇది సిబ్బంది చేతివాటం అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు జరుపుతున్నారు. నాలుగైదు నెలలుగా మంగళగిరి ప్రాంతంలో ఏటీఎంలలో నగదు ఉంచే సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సీఎంఎస్ సంస్థ పలు బ్యాంకుల ఏటీఎంలలో నగదు జమ చేస్తుంది. అందులో పని చేస్తున్న కొందరు.. ఏటీఎంలలో నగదు జమ చేయకుండా దారి మళ్లించినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా, దాదాపుగా కోటి 12 లక్షల రూపాయల నగదుకు సంబంధించి తేడా వచ్చింది. దాంతో యజమాన్యం అలర్ట్ అయ్యింది. క్యాష్ జమ చేసే సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.