ఆంధ్రాలో భారీ వర్షసూచన

ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షం కురవనుంది. బంగాళాఖాతం నుంచి తమిళనాడు దానికి ఆనుకుని వున్న దక్షిణ కోస్తా, రాయలసీమపైకి తూర్పుగాలులు బలంగా వీస్తున్నాయి. ఈ ప్రభావంతో గురువారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఒకటి, రెండుచోట్ల భారీగా వర్షం కురవనుంది. మిగిలినచోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
కలక్కడలో 9, గురజాలలో 4, కరంబాడిలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది.