నేను పవన్ కళ్యాణ్ : ప్రభుత్వాన్ని కూల్చే వరకు జనసేన నిద్రపోదు

వైసీపీ ప్రభుత్వానికి జనసేనానీ పవన్ కళ్యాణ్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వాన్ని కూల్చే వరకు జనసేన నిద్రపోదని..వైసీపీ నేతలకు అందరికీ చెబుతున్నా..నేను పవన్ కళ్యాణ్..అంటూ వ్యాఖ్యానించారు. ఏపీ రాష్ట్రంలో వైసీపీ భవిష్యత్‌లో అధికారంలోకి రాకుండా తొలగించాలని పిలుపునిచ్చారు. మదం ఎక్కి ఇలాంటి పనులు చేస్తున్నారని, గతంలో రాజధానిపై ఓ నిర్ణయం జరిగిందని..వచ్చిన ప్రభుత్వం తు.చ తప్పకుండా పాటించాలని సూచించారు. వారి వినాశనం మొదలైందన్నారు.
2020, జనవరి 21వ తేదీ మంగళవారం అమరావతిలో రాజధాని ప్రాంతాలకు చెందిన రైతులు, మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఫైర్ అయ్యారు. ఆందోళనలో పాల్గొన్న వారిపై దాడులు చేయడాన్ని ఖండించారు.
మూడు రాజధానుల ప్రకటన అనంతరం ఆందోళనల్లో పాల్గొన్న మహిళలపై విచక్షణారహితంగా దాడులు చేశారని తెలిపారు. ధర్మం చెబుతోంది..శాశ్వత రాజధాని అమరావతిలోనే ఉంటుందన్నారు. అమరావతి పరిరక్షణ సమితికి తన సపోర్టు ఉంటుందని హామీనిచ్చారు. దెబ్బలు పడిన వారి కోసం తాను వస్తానని, వేరే వారి కోసం రానన్నారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ పేరిట ఎవరు తప్పులు చేశారో వారిని శిక్షించాలని సూచించారు. వైసీపీకి చెందిన నేతల భూములు విశాఖలో ఉన్నాయని, వారికి ఉత్తరాంధ్రపై ప్రేమ లేదన్నారు పవన్.
Read More : మండలిలో వ్యూహ ప్రతివ్యూహాలు : డొక్కా పయనం ఎటు