ఐదోసారి ముఖ్యమంత్రి అవుతా- అసెంబ్లీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

డిసెంబర్ 1 నుంచి నేను కూడా గేర్ మార్చాలని అనుకుంటున్నా. 6 నెలల అయ్యింది.

ఐదోసారి ముఖ్యమంత్రి అవుతా- అసెంబ్లీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

Updated On : November 22, 2024 / 9:05 PM IST

Cm Chandrababu Naidu : ఐదోసారి తాను ముఖ్యమంత్రిని అవుతానని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, పదో సారి కూడా విజయం సాధిస్తానని ఆయన విశ్వాసం వెలిబుచ్చారు. ప్రజలకు మంచి చేస్తే మళ్లీ మళ్లీ దీవిస్తారని, కొన్ని రాష్ట్రాల్లో ఒక పార్టీ 30ఏళ్లుగా పాలిస్తున్నట్లు గుర్తు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

విధ్వంసం చేశారు..
”చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయనన్ని తప్పులు చేశారు. ఒక పక్కన వ్యవస్థలు పూర్తిగా విధ్వంసం అయ్యాయి. అధికార యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయ్యింది. అప్పులు పరాకాష్టకు చేరాయి. తప్పుడు ప్రచారాన్ని ఆధారంగా చేసుకుని అనునిత్యం ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు. ఎన్ని విషయాల్లో వాస్తవాలు చెప్పినా.. అవి పక్కన పెట్టి.. వారు నమ్మిన అసత్యాన్ని పదే పదే చెప్పి ప్రజలను మభ్య పెట్టాలనే ప్రయత్నం చేశారు. ఇది చాలా దురదృష్టకరమైన రాజకీయం”.

గేర్ మారుస్తా..
”డిసెంబర్ 1 నుంచి నేను కూడా గేర్ మార్చాలని అనుకుంటున్నా. 6 నెలల అయ్యింది. చెప్పాను. రోడ్ మ్యాప్ ఇచ్చాను. పాలసీలు ఇచ్చాం. ఇక జవాబుదారితనం తీసుకొస్తేనే ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం ద్వారా మళ్లీ నెక్ట్స్ లెవల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్తానని ఈ సభ ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నా”.

విజన్ 2027..
”జవాబుదారితనంగా పని చేస్తాం. ఈరోజు నేను తయారు చేసిన విజన్ 4.0 విజన్. వెర్షన్ 1. ఈ వెర్షన్ 1 2047కి ఇస్తాం. ప్రతి ఏటా మారిన పరిస్థితులకు అనుగుణంగా వెర్షన్లు మారుతుంటాయి. ఐదేళ్లలో 4.0, 4.1, 4.2, 4.3 వస్తుంది. ఇలా ఐదేళ్లలో 5 వెర్షన్లు వస్తాయి. ఈ ఐదూ చేసిన తర్వాత ప్రతి ఏటా ప్రజలకు చెబుతాం. మీకు ఇది చెప్పాం, ఇది చేశాం అని వివరిస్తాం. ఎక్కడైనా చేయలేకపోతే ఎందుకు చెయ్యలేదో వివరణ ఇస్తాం.”

ఐదోసారీ నేనే..
”మళ్లీ ఐదోసారి ముఖ్యమంత్రిని అయ్యి మనమంతా తిరిగి వద్దాం. విజన్ 5.0 తీసుకొస్తాం. గుజరాత్ లో మీరు చూశారు. 30ఏళ్లుగా ఒకే పార్టీ అధికారంలో ఉంది. అక్కడ బీజేపీనే ఉంది. హర్యానాలో మూడుసార్లు వాళ్లే గెలిచారు. మనం ప్రజల కోసం పని చేసి, ప్రజలను కన్విన్స్ చేసి, మన ప్రవర్తన వల్ల, మన పనుల వల్ల ప్రజలను చైతన్యవంతం చేయగలిగితే.. ప్రజలను మోటివేట్ చేయగలిగితే ఎప్పుడూ మనతోనే ఉంటారు. ఇప్పుడు నేను 9వ సారి ఎమ్మెల్యే. పదోసారి కూడా అవుతా” అని ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.

”వరుసగా ఓటు వేస్తున్నారు. మరోసారి కూడా ఓటు వేస్తారు. ఓటు వేసిన ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అన్నది ముఖ్యం. మన ప్రవర్తన ముఖ్యం. వాళ్లు మనల్ని ఆమోదించాలి. వాళ్ల కోసం మనం పని చేశామన్న నమ్మకాన్ని కలిగించాలి. వాళ్ల జీవితాల్లో మార్పులు తీసుకురాగలిగితే ప్రజలు మనతోనే ఉంటారు. ఆ దిశగా మీరంతా పని చేయాలని ఆకాంక్షిస్తున్నా” అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Also Read : మూడు నాలుగు రోజుల్లో బ్లాస్టింగ్‌ న్యూస్ రాబోతుందా? వైసీపీ కీలక నేతలను వెంటాడుతున్న అరెస్టుల టెన్షన్..