Panchakarla Ramesh Babu : రాజకీయంగా ఎవరు చేయలేని పని పవన్ కళ్యాణ్ చేశారు : పంచకర్ల రమేష్ బాబు

తనపై అలాంటి ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని పేర్కొన్నారు. సుబ్బారెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని వెల్లడించారు.

Panchakarla Ramesh Babu : రాజకీయంగా ఎవరు చేయలేని పని పవన్ కళ్యాణ్ చేశారు : పంచకర్ల రమేష్ బాబు

Ramesh Babu

Updated On : July 18, 2023 / 4:22 PM IST

Ramesh Babu join Janasena : జులై 20వ తేదీన సాయంత్రం 4 గంటలకు జనసేనలో జాయిన్ అవుతానని పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. జనసేనలో కార్యకర్తగా ఏ పని ఇచ్చినా చేస్తానని పేర్కొన్నారు. 400 కార్లు, 25 బస్ లతో అమరావతి వెళతానని చెప్పారు. కార్యకర్తలతో మాట్లాడిన తరువాత తమ కార్యకర్తలు కూడా జనసేనలో జాయిన్ అవడం వలన గౌరవం పెరుగుతుందన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా ఎవ్వరు చేయని పని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేశారని కొనియాడారు.

సొంత డబ్బులతో రైతులను ఆదుకున్నారని.. ఆ పని ఏ రాజకీయ నాయకుడు చేయలేదన్నారు. ఏ పార్టీలో లేనప్పుడు పెందుర్తి నుంచే పోటీచేస్తాను అన్నాను.. అది తన వ్యక్తిగతం అన్నారు. ఇక నుంచి తమ అదినేత పవన్ కళ్యాణ్ ఏది చెప్తే అది చేస్తానని స్పష్టం చేశారు. తాను పార్టీలో జాయిన్ అవుతానని మాత్రమే పవన్ కళ్యాణ్ ని అడిగానని చెప్పారు. పార్టీ వ్యవహారాల గురించి తనతో ఏమి చేర్చించలేదన్నారు.

Pilli Subhash Chandra Bose: గొడవలు శ్రుతిమించుతున్న వేళ.. జగన్‌ను కలిసిన పిల్లి సుభాష్ చంద్రబోస్

వైసీపీలో పని చేసిన రెండున్నర ఏళ్లలో ఎక్కడా ఆర్ధిక లబ్ధి పొందలేదని తెలిపారు. తిరుపతికి ఎవ్వరైన వెళ్తున్నారంటే వైవీ సుబ్బారెడ్డి లెటర్ తప్ప ఏమి తీసుకోలేదని స్పష్టం చేశారు. తనపై అలాంటి ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని పేర్కొన్నారు. సుబ్బారెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని వెల్లడించారు. వైసీపీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయమని అడిగినా తాను విమర్శలు చేయనని చెప్పానని తెలిపారు.

శృతి మించి మాట్లాడటం తన నైజం కాదన్నారు. జనసేనలో జాయిన్ కావడానికి ముoదు చిరంజీవి కుటుంబంతో గానీ, వేరే ఎవరితో మాట్లాడలేదని తెలిపారు. వైసీపీలో తనకు గౌరవం లేకపోవడం వల్లనే బయటకి వచ్చానని స్పష్టం చేశారు. రాజీనామా గురించి వైవీ సుబ్బారెడ్డి గారిని కలవలేదు అనడం అవాస్తవం అన్నారు. తాను చాలా సార్లు కలిశానని తెలిపారు. ఆయన ఎందుకు అలా అన్నారో తెలియదన్నారు.