IAS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీ.. 8 జిల్లాలకు కొత్త కలెక్టర్లు
IAS Transfers : చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, విజయనగరం, బాపట్ల, కర్నూలు, కృష్ణా, శ్రీసత్యసాయి జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది.

IAS Transfers
IAS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 57మంది ఐఏఎస్ లకు స్థానచలనం కల్పించింది. 8 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. మైనార్టీ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అనంత రామ్ ను, హెచ్ ఆర్డీ డీజీగా ఆర్పీ సిసోడియాను అపాయింట్ చేసింది. చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, విజయనగరం, బాపట్ల, కర్నూలు, కృష్ణా, శ్రీసత్యసాయి జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది.
శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ – అరుణ్ బాబు
అనంతపురం జిల్లా కలెక్టర్ – పి.గౌతమి
విజయనగరం జిల్లా కలెక్టర్ – నాగలక్ష్మి
కృష్ణా జిల్లా కలెక్టర్ – రాజబాబు
కర్నూలు జిల్లా కలెక్టర్ – సృజన
బాపట్ల జిల్లా కలెక్టర్ – రంజిత్
నెల్లూరు జిల్లా కలెక్టర్ – ఎం.హరినారాయణ్
చిత్తూరు జిల్లా కలెక్టర్ – షన్మోహన్