AP High Court : కోవిడ్ సెంటర్లు, బెడ్లు పెంచాలి : ఏపీ హైకోర్టు

ఏపీలో కోవిడ్ పరిస్థితులపై హైకోర్టులో విచారణ ముగిసింది. అనంతపురం ఆస్పత్రిలో కోవిడ్ మరణాలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

AP High Court : కోవిడ్ సెంటర్లు, బెడ్లు పెంచాలి : ఏపీ హైకోర్టు

Inquiry In The High Court On The Covid Conditions In The Ap

Updated On : May 6, 2021 / 6:40 PM IST

AP High Court : ఏపీలో కోవిడ్ పరిస్థితులపై హైకోర్టులో విచారణ ముగిసింది. అనంతపురం ఆస్పత్రిలో కోవిడ్ మరణాలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఆక్సిజన్ ను దూర ప్రాంతాల నుంచి కాకుండా దగ్గరున్న బళ్లారి, తమిళనాడు నుంచి తీసుకొచ్చే అవకాశాన్ని పరిశీలించాలని చెప్పింది.  ఆక్సిజన్ స్వయం సమృద్ధికి ఏం చర్యలు చేపట్టారని ప్రశ్నించింది.

కోవిడ్ సెంటర్లు, బెడ్లు పెంచాలని ఆదేశించింది. నోడల్ అధికారులు 24 గంటలూ అందుబాటులో ఉండాలని తెలిపింది. వ్యాక్సినేషన్ పై ఆరా తీసింది.