AP Politics : ఉత్కంఠ రేపుతున్న పెనమలూరు రాజకీయం.. పార్థసారథి వ్యవహారంలో టీడీపీలో కొనసాగుతున్న ఉత్కంఠ

కృష్టా జిల్లా పెనమలూరు నియోజకవర్గం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నియోజకవర్గం సీటును పార్థసారథికి ఇచ్చేందుకు టీడీపీ హైకమాండ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

AP Politics : ఉత్కంఠ రేపుతున్న పెనమలూరు రాజకీయం.. పార్థసారథి వ్యవహారంలో టీడీపీలో కొనసాగుతున్న ఉత్కంఠ

Penamaluru Politics

Updated On : January 13, 2024 / 7:29 AM IST

Penamaluru Politics : కృష్టా జిల్లా పెనమలూరు నియోజకవర్గం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నియోజకవర్గం సీటును పార్థసారథికి ఇచ్చేందుకు టీడీపీ హైకమాండ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి లోకేశ్ ని పార్థసారథి కలుస్తారంటూ ప్రచారం జరిగింది. ఇప్పటి వరకు లోకేశ్ ని ఆయన కలవలేదు. అయితే, ఇంతకు ముందు లోకేశ్ ను పార్థసారథి రెండు సార్లు కలిశారని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు పెనమలూరు టీడీపీ ఇంచార్జ్ బోడే ప్రసాద్ కు టీడీపీ హైకమాండ్ నచ్చచెబుతోంది. ఈ క్రమంలో గద్దె రామ్మోహన్ తో టీడీపీ అధిష్టానం రాయబారం నడుపుతుంది. బోడే ప్రసాద్ తో ఆయన భేటీ అయ్యారు. బోడె ప్రసాద్ రాజకీయ భవిష్యత్తుకు టీడీపీ హై కమాండ్ భరోసా ఇస్తుంది.