Pawan Kalyan : ఒక్కసారి జనసేనను నమ్మండి, మీకు అండగా ఉంటాను- పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

వైసీపీ పాలనలో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారింది. నేను మతవివక్ష చూపించను. ముస్లింలను ఓటు బ్యాంకుగా చూడను.

Pawan Kalyan : ఒక్కసారి జనసేనను నమ్మండి, మీకు అండగా ఉంటాను- పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan

Updated On : December 14, 2023 / 7:05 PM IST

అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందుకు సాగుతున్నారు. ఓటర్లను అట్రాక్ట్ చేసేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఒక్కసారికి జనసేనను నమ్మండి అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. నేను ఒక్కసారి మాటిస్తే వెనక్కి వెళ్లను, మీకు అండగా ఉంటాను అని హామీ ఇచ్చారు జనసేనాని. విశాఖకు చెందిన మైనారిటీ నాయకుడు సాధిక్, దర్శికి చెందిన గరికపాటి వెంకట్ జనసేనలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read : 150 సీట్లు మార్చినా గెలవరు- వైసీపీలో మార్పులపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

”మీ రాక జనసేనకు చాలా‌ బలం. మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నా. గత తొమ్మిదేళ్లుగా జనసేన అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని ఇక్కడికి వచ్చింది. వైసీపీ లాంటి గూండా నాయకులను ఎదుర్కోగలుగుతున్నాం. యువత నాకు అండగా నిలిచింది. మనందరం కలిసి పోరాటాలు చేయాలి.
వైసీపీ పాలనలో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారింది. దిక్కు లేకుండా పోయింది. మైనారిటీ అనే పదంతో దూరంగా వెల్ళిపోవడం బాధేస్తుంది. మీరంతా మెయిన్ స్ట్రీమ్ లో ఉండాలి.

Also Read : వినూత్న పద్ధతిలో సర్వే.. టికెట్ల కేటాయింపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

నాకు మతాలపైన చాలా గౌరవం ఉంది. నన్ను ప్రేమించే మైనారిటీలు.. నేను బీజేపీతో ఉన్నానని అందుకే దూరంగా ఉన్నామని అంటుంటారు. కానీ మీకు ఏమైనా నష్టం జరిగితే నేను ఎల్లప్పుడూ అండగా ఉంటా. నేను మతవివక్ష చూపించను. అన్ని మతాల వారు మీ వద్దకు రావాలి. కులం, మతం దాటి వచ్చాను. మానవత్వాన్ని నమ్ముతాను. వైజాగ్ ముస్లింల సమస్యలు, ఇబ్బందులు నాకు తెలుసు. నేను మీకు అండగా ఉంటాను. ఒక్కసారి జనసేనను నమ్మండి. ముస్లింలను మైనారిటీ ఓటు బ్యాంకుగా చూడను” అని పవన్ కల్యాణ్ అన్నారు.