ఢిల్లీలో జనసేనాని.. ‘ఇదెప్పుడో చేయాల్సింది కుదరలేదు’

ఢిల్లీలో జనసేనాని.. ‘ఇదెప్పుడో చేయాల్సింది కుదరలేదు’

Updated On : February 20, 2020 / 6:51 AM IST

జనసేన పార్టీ అధికనేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర సైనిక బోర్డు కార్యాలయానికి వెళ్లి రూ. కోటి విరాళాన్ని అందించారు. అమర సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు తానూ కొంత సాయం చేశానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 

‘ఈ రోజున గత డిసెంబరులో  బ్రిగేడియర్ వికేంద్రకుమార్ లెటర్ రాశారు. ఆర్మీ ఫోర్స్ బ్లాక్ డే సందర్భంగా సైనికులకు ఏదైనా చేయమని అడిగారు. సైనిక్ వెల్ఫేర్ కోసం మనస్ఫూర్తిగా రాసిన లెటర్ నాకు బలంగా తాకింది. అప్పుడే ఏదో ఒకటి చేద్దమానుకున్నాను. గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇద్దామనుకున్నాను. అందుకని చిన్నపాటి సాయం చేద్దామనుకన్నాను. చేదోడుగా ఉంటుందని భావిస్తున్నాను. సైనిక్ బోర్డుకు అభిమానులు, జనసైనికులు, దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని ఆశిస్తున్నా’ అని ముగించారు పవన్. 

మీడియా ప్రతినిధులు ఎవరినైనా కలుస్తారా అని అడిగిన ప్రశ్నకు ‘ఎవరినైనా కలుస్తారా అనేది ఇంకా నిర్ణయించలేదు. కలవొచ్చు కలవకపోవచ్చు’ అని బదులిచ్చారు. 

రెండు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన పవన్.. మధ్యాహ్నం 3 గంటలకు విజ్ఞాన భవన్‌లో ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. రాజకీయాల్లో మార్పు కోసం యువత ఏవిధంగా ముందుకు రావాలో ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ ప్రసంగం చేస్తారు.  ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, మేఘాలయ అసెంబ్లీ స్పీకర్ మెత్బా లింగ్డో, కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా కూడా పాల్గొననున్నట్లు సమాచారం.