Thota Chandrasekhar : కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లోకి జనసేన కీలక నేత, బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు..!

భారత రాష్ట్ర సమితిలో చేరనున్నారు ఏపీకి చెందిన జనసేన కీలక నేత తోట చంద్రశేఖర్. రేపు సీఎం కేసీఆర్ సమక్షంలో తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.

Thota Chandrasekhar : కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లోకి జనసేన కీలక నేత, బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు..!

Updated On : January 1, 2023 / 7:54 PM IST

Thota Chandrasekhar : భారత రాష్ట్ర సమితిలో చేరనున్నారు ఏపీకి చెందిన జనసేన కీలక నేత తోట చంద్రశేఖర్. రేపు సీఎం కేసీఆర్ సమక్షంలో తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ అధికారి అయిన తోట చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

Also Read..BRS In AP : అమరావతిలో బీఆర్ఎస్ ఆఫీస్.. ఏపీలో త్వరలోనే బీఆర్ఎస్ కార్యక్రమాలు ప్రారంభం, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు

రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల మధ్య తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. అందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో 200 వాహనాలతో తెలంగాణ భవన్ కు ర్యాలీగా చేరుకోనున్నారు. నర్సాపురం నుంచి కూడా భారీగా జన సమీకరణ చేస్తున్నట్లుగా సమాచారం.

బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే కిసాన్ సెల్ ను ఏర్పాటు చేసి ముందుకు సాగుతున్నారు. ఇదే క్రమంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పార్టీ అధ్యక్షుల నియామకం పనిలో కూడా కేసీఆర్ నిమగ్నమై ఉన్నారు. ఒకవైపు ఏపీకి సంబంధించి జనసేనలో కీలకంగా పని చేస్తున్న తోట చంద్రశేఖర్ ఇక బీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధమయ్యారు. తోట చంద్రశేఖర్ తో పాటు మాజీమంత్రి రావెల కిషోర్ బాబు కూడా బీఆర్ఎస్ లో చేరనున్నట్లుగా సమాచారం అందుతోంది.

TRS To BRS : ‘అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో బీఆర్ఎస్ .. ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండాయే : సీఎం కేసీఆర్

రేపు తెలంగాణ భవన్ లో వీరి చేరికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తోట చంద్రశేఖర్ కు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఏపీతో పాటు 6 రాష్ట్రాల్లో తొలుత బీఆర్ఎస్ శాఖలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా ఏపీపై ఫోకస్ పెట్టారు కేసీఆర్. ఏపీకి చెందిన పలువురు నేతలు కేసీఆర్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. తోట చంద్రశేఖర్ మొదటగా బీఆర్ఎస్ లో చేరబోతున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.