తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్ లో ఉద్యోగాలు

ఏపీలోని తిరుపతిలో ఉన్న ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రి.. ఒప్పంద, ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్ లో ఉద్యోగాలు

Job Vacancies In Tirupati Meternity Hospital1

Updated On : March 26, 2021 / 7:46 PM IST

TIRUPATI ఏపీలోని తిరుపతిలో ఉన్న ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రి.. ఒప్పంద, ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 34

పోస్టుల వివరాలు: ల్యాబ్‌ టెక్నీషియన్లు-03, థియేటర్‌ అసిస్టెంట్‌-04, ఏఎన్‌ఎంలు -09, ల్యాబ్‌ అటెండెంట్లు-04, అటెండీస్‌-05, వార్డ్‌ బాయ్స్‌-04, స్ట్రెచర్‌ బేరర్స్‌-05.

అర్హత: పోస్టును అనుసరించి ఐదు, ఏడు, పదోతరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత కోర్సుల్లో డిప్లొమా, బీఎస్సీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 31.12.2020 నాటికి 42 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మార్కులు, వయసు ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: రిజిస్టర్డ్‌ పోస్ట్‌ ద్వారా/నేరుగాగాని ఆఫీస్‌ ఆఫ్‌ ద సూపరింటెండ్, ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రి, తిరుపతి చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 26.03.2021