TDP Chandrababu: చంద్రబాబు.. కేంద్రాన్ని అనలేకనే వైసీపీపై విమర్శలు – జోగి రమేశ్

టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రం చేసే పనులను ప్రశ్నించలేక వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ అంటున్నారు.

TDP Chandrababu: చంద్రబాబు.. కేంద్రాన్ని అనలేకనే వైసీపీపై విమర్శలు – జోగి రమేశ్

Chandrababu

Updated On : January 11, 2022 / 6:49 PM IST

TDP Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రం చేసే పనులను ప్రశ్నించలేక వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ అంటున్నారు. ప్రెస్ మీట్ లో మాట్లాడిన జోగి రమేశ్.. ‘పెట్రోల్, డీజిల్‌లతో పాటు నిత్యావసర ధరల పెరుగుదలకు కేంద్రమే కారణం. వాళ్లని ఒక్క మాట కూడా అనలేక.. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని’ ఆరోపించారు.

‘మార్కెట్ లో లభించే వస్తువుల ధరల కంటే హెరిటేజ్‌లోనే అధిక ధరలకు అమ్ముతున్నారు. అలా చేస్తూనే ధరలు తగ్గించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఐటీ ట్రిబ్యూనల్ అభిప్రాయాన్ని కూడా తప్పుబడుతున్నారు చంద్రబాబు. పెట్టుబడులను ఆదాయంగా పరిగణించకూడదని చెప్తున్నా వినిపించుకోవడం లేదు’

‘రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ట్రిబ్యూనల్ గానీ, సీబీఐ గాని అభిప్రాయం చెప్తే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నా’రని విమర్శించారు జోగి రమేశ్.

ఇది కూడా చదవండి : ‘రావణాసుర’ లో ‘రామ్’ గా..