KA Paul : ఏపీ రావణకాష్టంగా మారింది.. ప్రజలు నన్నే సీఎం కావాలంటున్నారు : కేఏ పాల్
ధర్మవరంలో జనాలను చూసి షాక్ అయ్యానని..కేతిరెడ్డి వద్దు బాబు వద్దు అంటున్నారు. పవన్ లా 100 మంది బౌన్సర్లతోను.. చంద్రబాబులా హై సెక్కురిటీతో నేను తిరగడంలేదు.. సింగిల్ గా వెళుతున్నా

KA Paul
KA Paul Andhra pradesh Politics : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణకాష్టంగా మారిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి విడుదల చేసిన ఆడియో చూసి షాక్ అయ్యానని.. ఆయనను కలవడానికి వెళ్లానని కానీ అక్కడ లేకపోవటం వల్ల కలవలేకపోయానని చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధర్మవరంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు, దాడులు, దోపిడీలు దారుణమన్నారు. ధర్మవరంలో జనాలను చూసి షాక్ అయ్యానని.. ”కేతిరెడ్డి వద్దు బాబు వద్దు మీరు సీఎం కావాలని అంటున్నార”ని చెప్పుకొచ్చారు.
పవన్ లా 100 మంది బౌన్సర్లతోను.. చంద్రబాబులా హై సెక్యురిటీతో నేను తిరగడంలేదు.. సింగిల్ గా వెళుతున్నానన్నారు. చంద్రబాబు.. దమ్ముంటే తనతో డిబేట్ కు రావాలంటూ సవాల్ విసురుతూ.. మరోపక్క లోకేశ్ పై సెటైర్లు వేశారు. ఎలాగూ లోకేష్ కు మాట్లాడడం రాదు కాబట్టి నాతో డిబేట్ కు చంద్రబాబు రావాలి అంటూ సవాల్ చేశారు. 100 వాగ్దానాలు చేసి ఒక్కటి చంద్రబాబు నెరవేర్చలేదంటూ విమర్శించారు. మాటలు రాని పప్పును సీఎం చెయ్యడానికి చంద్రబాబు అవస్థలు పడుతున్నాడంటూ సెటైర్లు వేశారు.
పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర వదిలేసి లోకేశ్ కోసం నారాహి యాత్ర చేస్తున్నాడని విమర్శించారు. 15 సీట్లకు పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయాడని.. ఆయనకు దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. జనసేనను ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలని సలహాయిచ్చారు. 2008లో పార్టీ పెట్టిన చిరంజీవి వెంట వెళ్లిన బలహీన వర్గాల నాయకులు కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారంటూ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఓ ప్యాకేజి స్టార్ అంటూ ఘాటుగా విమర్శించారు.
Mudragada Padmanabham : మీ బెదిరింపులకు భయపడి నేను లొంగిపోను.. పవన్ కళ్యాణ్ కు మరో లేఖ రాసిన ముద్రగడ
కొన్ని మీడియా సంస్థలు తనను కమెడియన్ లా చూపిస్తున్నాయని కేఏ పాల్ మండిపడ్డారు. అదాని, అంబానీలతో నార్త్ మీడియాను నరేంద్ర మోదీ కొనేశారని విమర్శించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం.. పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీలతో విలీనం అంటూ ఎద్దేవా చేశారు.