JanaSena: ద్వారంపూడిపై పోటీకి పవన్ కల్యాణ్ అవసరం లేదు.. ఈమె చాలు: జనసేన నేత దుర్గేశ్

పవన్ కల్యాణ్ ఏ సభలో మాట్లాడినా ఆయన మాటల్లో స్పష్టత ఉంటుందని దుర్గేశ్ చెప్పారు.

JanaSena: ద్వారంపూడిపై పోటీకి పవన్ కల్యాణ్ అవసరం లేదు.. ఈమె చాలు: జనసేన నేత దుర్గేశ్

Kandula Durgesh

Updated On : June 19, 2023 / 5:27 PM IST

JanaSena – Kandula Durgesh: వైసీపీ (YCP) ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి(Dwarampudi Chandrasekhar Reddy)పై పోటీకి తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అవసరం లేదని, కాకినాడ నుంచి ఒక వీర మహిళ చాలు అని జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేశ్ అన్నారు. పోటీకి సిద్ధమా? అని ఆయన సవాల్ విసిరారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర నిర్వహిస్తోన్న వేళ ఆయనకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపై సవాళ్లు విసురుకున్నారు. దీనిపై కందుల దుర్గేశ్ ఇవాళ మీడియాతో మాట్లాడారు.

పవన్ కల్యాణ్ ఏ సభలో మాట్లాడినా ఆయన మాటల్లో స్పష్టత ఉంటుందని దుర్గేశ్ చెప్పారు. ద్వారంపూడి అవినీతి బాగోతం సహా ఆయన చేసిన భూకబ్జాలు, ఆయిల్, బియ్యం మాఫియా గురించి గణాంకాలతో పాటు చెప్పారని అన్నారు. అవినీతి అరోపణలకు వివరణ ఇవ్వకుండా ద్వారంపూడి.. పవన్ పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని విమర్శించారు.

పవన్ మాట్లాడిన మాటలకు సమాధానం ఇవ్వలేక ద్వారంపూడి తోక జాడిస్తున్నారని చెప్పారు. పవన్ పెద్ద గూండా అని అనడానికి మంత్రి బొత్స సత్యనారాయణ వద్ద ఏ ఆధారాలు ఉన్నాయని నిలదీశారు. వైసీపీ చేసే కబ్జాలు, అరాచకాలు అన్నిటికీ తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని దుర్గేశ్ అన్నారు.

Dwarampudi Chandrasekhar : పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ వ్యభిచారి.. ఎమ్మెల్యే ద్వారంపూడి సంచలన వ్యాఖ్యలు