Karanam Venkatesh : చీరాల వైసీపీలో మరోసారి భగ్గుమన్న వర్గ విభేదాలు.. ఆమంచి సోదరులకు కరణం వెంకటేశ్‌ స్ట్రాంగ్ వార్నింగ్

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో రాజకీయం మరోసారి వేడెక్కింది. చీరాలలో ఆమంచి, కరణం ఫ్యామిలీల మధ్య వార్‌ ఎప్పటి నుంచో ఉంది. ఇటీవల స్థానిక సంస్థలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా రెండు వర్గాలు రోడ్డున పడ్డాయి.

Karanam Venkatesh : చీరాల వైసీపీలో మరోసారి భగ్గుమన్న వర్గ విభేదాలు.. ఆమంచి సోదరులకు కరణం వెంకటేశ్‌ స్ట్రాంగ్ వార్నింగ్

Karanam Venkatesh warning Aamanchi brothers

Updated On : September 4, 2023 / 1:22 PM IST

Karanam Venkatesh – Aamanchi Brothers : చీరాలలో మరోసారి రాజకీయం వేడెక్కింది. వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఆమంచి వర్సెస్ కరణంగా మారింది. ఆమంచి సోదరులకు ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేశ్‌ ఈసారి బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. కూల్‌గా ఉన్న చీరాలలో మంటలు రేపితే ఊరుకునేది లేదని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఓ విధంగా చెప్పాలంటే హీరో బాలయ్య బాబును మించేలా డైలాగ్స్ వదిలారు. అయితే కరణం వెంకటేష్ మాటలకు అదే స్థాయిలో ఆమంచి సోదరుడు సైతం బదులు ఇచ్చారు. దీంతో చీరాలలో రాజకీయం మరింత రంజుగా మారింది.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో రాజకీయం మరోసారి వేడెక్కింది. చీరాలలో ఆమంచి, కరణం ఫ్యామిలీల మధ్య వార్‌ ఎప్పటి నుంచో ఉంది. ఇటీవల స్థానిక సంస్థలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా రెండు వర్గాలు రోడ్డున పడ్డాయి. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ పొరపాటున నోరుజారి కమ్మ వర్గంపై చేసిన కామెంట్స్ కాంట్రవర్సీకి దారి తీశాయి. ఆ తర్వాత ఆయన సారీ చెప్పడంతో ఆ వివాదం సద్దుమణిగినా… కరణం, ఆమంచి వర్గాల మధ్య మాత్రం గొడవలు మరింత ముదిరాయి.

Gudivada Amarnath : చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్.. అన్ స్కిల్డ్ పొలిటీషియన్ : మంత్రి గుడివాడ

ఇటీవల ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు, జనసేన నేత ఆమంచి స్వాములు కరణం వెంకటేష్ పై తీవ్ర విమర్శలు చేశారు. దీనికి కౌంటర్ గా కరణం వెంకటేష్.. వైఎస్ఆర్ వర్థంతి రోజున ఘాటు విమర్శలు చేశారు. దీంతో మరోసారి చీరాలలో పొలిటికల్ హీట్ రాజుకుంది. చీరాల నియోజకవర్గం ఆమంచి ఫ్యామిలీకి కంచుకోటలా ఉండేది. 2014లో స్వతంత్రంగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్, తర్వాత టీడీపీలో చేరి, 2019 ఎన్నికల సమయానికి వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

అదే సమయంలో టీడీపీ నుంచి చీరాల ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం వైసీపీలో చేరారు. దీంతో ఒకే ఒరలో రెండు కత్తులు అన్నట్టుగా పరిస్థితి మారింది. బలరాం చేరికతో వైసీపీ ఇన్ చార్జ్ గా కూడా ఆమంచికి న్యాయం జరగలేదు. ఆయన్ను పక్క నియోజకవర్గానికి పంపించి వేశారు. ఆమంచి పర్చూరు నియోజకవర్గానికి వెళ్లడంతో 2024 చీరాల వైసీపీ టికెట్ కూడా కరణం కుటుంబానికే అనేది దాదాపుగా ఖాయమైంది. ఈ దశలో సొంత నియోజకవర్గంలో పట్టు కోసం ఆమంచి కుటుంబం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

Chirala: ఆమంచి, కరణం గ్రూప్‌వార్‌.. వైసీపీ ట్రబుల్ షూటర్‌ ఎంట్రీతో పరిస్థితులు చక్కబడతాయా?

కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు ఇటీవల జనసేనలో చేరారు. ఆయన చీరాల లేదా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇటీవల చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కుటుంబంపై స్వాములు ఘాటు విమర్శలు చేశారు. దీంతో అటువైపు నుంచి కూడా కౌంటర్లు మొదలయ్యాయి. 2024లో చీరాల నుంచి తానే బరిలో ఉంటానని కరణం వెంకటేష్ ప్రకటించారు. ఎవరొస్తారో చూస్తానంటూ సవాల్ విసిరారు. గతంలో కంటే మరింత స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఈ మాస్ వార్నింగ్ కి ఆమంచి కుటుంబం నుంచి ఘాటుగానే మాటలు వచ్చాయి. వెంకటేష్‌ కామెంట్స్‌పై జనసేన నేత ఆమంచి స్వాములు మండిపడ్డారు. చీరాల అంటేనే ప్రశాంతతకు మారుపేరని, ఏ కుక్కలో వాగితే పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎవరి బెదిరింపులకు తాము భయపడేది లేదన్నారు. మొత్తంగా కరణం ఫ్యామిలీ వర్సెస్ ఆమంచి ఫ్యామిలి మధ్య మాటల మంటలతో మళ్లీ చీరాలలో పొలిటికల్ రంగు మారుతోంది. మరి అధిష్టానం ఈ రెండు వర్గాల మధ్య వైరానికి ఎలా ఫుల్‌స్టాప్ పెడుతుందో చూడాలి.