వైసీపీ విజయవాడ ఎంపీ సీటు ఇంకా ఖరారు కాలేదు.. టీడీపీ నేత కేశినేని చిన్ని

విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అవుతాడో, వెల్లంపల్లి అవుతాడో వేచి చూడాలన్నారు తెలుగుదేశం నేత కేశినేని శివనాథ్(చిన్ని).

వైసీపీ విజయవాడ ఎంపీ సీటు ఇంకా ఖరారు కాలేదు.. టీడీపీ నేత కేశినేని చిన్ని

kesineni chinni comments on vijayawada ysrcp candidate selection

Updated On : February 17, 2024 / 12:26 PM IST

Kesineni Chinni: మరో రెండు నెలల్లో కేశినేని నాని ప్రజా జీవితానికి దూరం కావటం ఖాయమని తెలుగుదేశం నేత కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీలోకి వెళ్లిన కేశినేని నాని జగన్ దగ్గర పాలేరుగాను, ఇంచార్జ్ లకు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ విజయవాడ ఎంపీ సీటు ఇంకా ఖరారు కాలేదని, నానికి మొండిచేయి తప్పదని అన్నారు. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అవుతాడో, వెల్లంపల్లి అవుతాడో వేచి చూడాలన్నారు. వారికి అసిస్టెంట్‌గా నాని మిగిలిపోతారని జోస్యం చెప్పారు.

”చంద్రబాబుని విమర్శించే వారిని ముందు ప్రోత్సహించి తర్వాత సీటు ఎగ్గొట్టడం జగన్ నైజం. విజయవాడ పశ్చిమలో తెలుగుదేశం టిక్కెట్లు ఇప్పిస్తానని కేశినేని నాని ఇద్దరి వద్ద డబ్బులు వసూలు చేశాడు. మైలవరంలోనూ ఇలాంటి ప్రయత్నమే చేశాడు. కేశినేని నాని ఎవరెవరి దగ్గర డబ్బులు వసూలు చేశాడో.. త్వరలోనే అన్ని ఆధారాలు బయటపెడతాం. కేశినేని నానికి డబ్బులిచ్చి మోసపోయిన వారు త్వరలోనే మీడియా ముందుకు వస్తారు.

పిట్టలదొర ఎవరో త్వరలో ప్రజలే నిర్ణయిస్తారు. తన అక్రమాలు ఒక్కొక్కటీ బయటపడుతుండటంతో పార్టీ మారిన కోవర్టు కేశినేని నాని. చంద్రబాబు అరెస్టు సమయంలో ఢిల్లీలో లోకేశ్ ఏయే లాయర్లను కలిశారు.. ఎవరెవరితో మాట్లాడుతున్నారనే విషయాన్ని వైసీపీకి చేరవేశారు. పారిపోవటానికి సిద్ధం అంటూనే వైకాపా నేతలు పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నారని” కేశినేని చిన్ని అన్నారు.

Also Read: ఏపీ ఫైబర్ నెట్ కేసులో సీఐడీ ఛార్జిషీట్ దాఖలు.. ఏ1గా చంద్రబాబు