Pregnant : కథ వేరే ఉంది.. పెళ్లైన మూడు రోజులకే ప్రెగ్నెంట్!

పెళ్ళైన మూడు రోజులకే ఆమె మూడు నెలల గర్భవతి అనే భర్తకు తెలిసింది. దీంతో ఆమెను వదిలేశాడు. అనంతరం ప్రియుడి సలహాతో మరో రెండు పెళ్లిళ్లు చేసుకొని కటకటాలపాలైంది.

Pregnant : కథ వేరే ఉంది.. పెళ్లైన మూడు రోజులకే ప్రెగ్నెంట్!

Pregnant

Updated On : August 29, 2021 / 1:25 PM IST

Pregnant : సమాజంలో కిలాడీ లేడిల సంఖ్య పెరిగిపోతోంది. రెండు తెలుగురాష్ట్రాల్లో కిలాడీ లేడీలకి సంబంధించి రోజుకో ఘటన బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. డబ్బు కోసం ఒకరి తరువాత ఒకరిని పెళ్లి చేసుకుంటూ యువకులను దారుణంగా మోసం చేస్తున్న ఘటనలు గత కొద్దీ నెలల్లో అనేకం వెలుగు చూశాయి. ఇక తాజాగా విశాఖ జిల్లాలో ఇటువంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా చినగంట్యాడకు చెందిన యువతి మూడు పెళ్లిళ్లు చేసుకుంది.. రెండవ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.. ఇండియన్‌ ఆర్మీ ఉద్యోగి ప్రసాద్‌ గతేడాది డిసెంబర్ లో కిలాడీ లేడిని పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆమెను లక్నో తీసుకెళ్లాడు. అక్కడే బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు కొనిపించుకుని.. దశలవారీగా రూ.90 లక్షల వరకు తీసుకున్న యువతి గాజువాక వచ్చేసింది.

మళ్లీ ఆమె తిరిగి రాకపోవడంతో బాధితుడు గాజువాక వచ్చి ఎంక్వైరీ చేశాడు. ఆమెకు అగనంపూడి, గాజువాకకు చెందిన మరో ఇద్దరితో పెళ్లిళ్లు అయినట్టు షాకింగ్ నిజాలు తెలిశాయి. ప్రసాద్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోని విచారించారు. దీంతో సంచలన విషయాలు బయపడ్డాయి.

ప్రియుడి కారణంగా గర్భవతి అయిన యువతి తల్లిదండ్రుల ఒత్తిడితో వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లిచేసుకున్న వ్యక్తికి మూడో రోజే ఆమె గర్భవతి అని తెలిసింది. దీంతో అతడు వదిలేశాడు. భర్త వదిలేయడంతో తన విషయం ప్రియుడికి చెప్పి పెళ్లి చేసుకోవాలని కోరింది. ఇక్కడే ప్రియుడు ఓ ప్లాన్ వేశాడు. తమ చుట్టాలో డబ్బున్నవారు ఉన్నారని.. వారిని పెళ్లి చేసుకొని డబ్బు లాగాలని తెలిపాడు.

ప్రియుడి మాటలు విన్న యువతి డిసెంబర్ లో ఆర్మీ అధికారి ప్రసాద్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతడి నుంచి డబ్బు గుంచి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. రెండవ భర్త ప్రసాద్ ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె మోసం చేసినట్లు నిర్దారణ కావడంతో నిందితురాలిపై ఐపీసీ 420, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.