Kottu Satyanarayana : ఎక్కడ గొడవలు జరిగినా అక్కడ ఉండేది జనసేన గుండాలే- పవన్ కల్యాణ్ పై మంత్రి కొట్టు ఫైర్

పవన్ కల్యాణ్ సొల్లు కబుర్లు మాని అవగాహన పెంచుకోవాలని మంత్రి కొట్టు సత్యనారాయణ హితవు పలికారు. Kottu satyanarayana

Kottu Satyanarayana : ఎక్కడ గొడవలు జరిగినా అక్కడ ఉండేది జనసేన గుండాలే- పవన్ కల్యాణ్ పై మంత్రి కొట్టు ఫైర్

Kottu Satyanarayana - Pawan Kalyan (Photo : Google)

Updated On : October 4, 2023 / 11:53 PM IST

Kottu Satyanarayana – Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఫైర్ అయ్యారు. తన యాత్రలో గొడవలు చేసేందుకు, తనపై రాళ్ల దాడికి వైసీపీ కుట్ర చేసిందని పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలను మంత్రి కొట్టు ఖండించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు మాట్లాడుతూ.. పవన్ పై విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ యాత్రలో గొడవలు చేయాల్సిన అవసరం మాకు లేదని ఆయన తేల్చి చెప్పారు. జనసేన కార్యకర్తలే మద్యం మత్తులో గొడవలు పడుతూ ఉంటారని అన్నారు.

Also Read..Pawan Kalyan: తనకు అందిన నోటీసులపై పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్

ఎక్కడ గొడవలు జరిగినా అక్కడ ఉండేది జనసేన గుండాలే అని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ సొల్లు కబుర్లు మాని అవగాహన పెంచుకోవాలని మంత్రి కొట్టు సత్యనారాయణ హితవు పలికారు. సీఎం జగన్ ప్రధానమంత్రితో మాట్లాడి కేంద్రం నుండి నిధులు తీసుకొస్తున్నారని చెప్పారు. పవన్ చేస్తున్న హెచ్చరికలన్నీ చంద్రబాబుకే చేస్తున్నట్లు ఉన్నాయన్నారు. చంద్రబాబు హయాంలో ఇసుక, మట్టి దోచుకున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. ప్రస్తుతం మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి రూ.4వేల కోట్ల ఆదాయం సమకూరిందని ఆయన తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో ఎంత ఆదాయం వచ్చిందో పవన్ కల్యాణ్ తెలుసుకోవాలన్నారు.