తిరుపతిలో ప్రత్యక్షమైన యువతి జ్యోతి

  • Published By: madhu ,Published On : November 4, 2020 / 02:44 PM IST
తిరుపతిలో ప్రత్యక్షమైన యువతి జ్యోతి

Updated On : November 4, 2020 / 2:59 PM IST

Kurnool Girl Jyothi Safe : కర్నూలు జిల్లాలోని అహోబిలంలో అదృశ్యమైన జ్యోతి కథ సుఖాంతమైంది. ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు రెండు రోజుల్లో ఈ కేసును చేధించారు. యువతి జ్యోతి 2020, నవంబర్ 04వ తేదీ బుధవారం తిరుపతిలో ప్రత్యక్షమైంది. శివశంకర్ అనే వ్యక్తిని తిరుపతిలో పెళ్లి చేసుకున్నట్లు జ్యోతి వెల్లడించింది. అనంతరం జ్యోతి, శివశంకర్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



అహోబిలం గ్రామానికి చెందిన జ్యోతిని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన శివశంకర్ ట్రాప్ చేశాడని బంధువులు ఆరోపించారు. గత నెల 26వ తేదీన ఇంటి నుంచి జ్యోతి వెళ్లిపోయింది. దీంతో కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. శివ శంకర్ అనే వ్యక్తి జ్యోతిని తీసుకెళ్లాడని పోలీసులకు బంధువులు ఫిర్యాదు చేశారు.



మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తాను బెంగళూరులో జాబ్ చేస్తున్నట్లు, లక్షల్లో జీతం అంటూ నమ్మించి జ్యోతిని తీసుకెళ్లాడని అంటున్నారు. శివశంకర్ కు భార, పిల్లలు కూడా ఉన్నారని, గతంలో కూడా ఇద్దరు అమ్మాయిలను ఇదే విధంగా ట్రాప్ చేశాడని ఆరోపిస్తున్నారు. జ్యోతి కథ సుఖాంతం కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.