AP liquor shop Tenders: ఏపీలో మద్యం దుకాణాల టెండర్లకు లాస్ట్ డే.. ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?
చివరి రోజు కావడంతో 20వేలకుపైగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద 80వేలకుపైగా దరఖాస్తులు అందుతాయని అంచనా.

AP liquor shop Tenders : ఏపీలో మద్యం దుకాణాల టెండర్లలో భాగంగా భారీగా దరఖాస్తులు దాఖలవుతున్నాయి. ఇవాళ చివరి రోజు కావడంతో దరాఖాస్తులను దాఖలు చేసేందుకు బారులు తీరారు. రాత్రి 7గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 6569 దరఖాస్తులు దాఖలుకాగా.. రూ.1312 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. చివరి రోజు కావడంతో 20వేలకుపైగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద 80వేలకుపైగా దరఖాస్తులు అందుతాయని అంచనా.
Also Read: Samsung Company: తమిళనాడులో శాంసంగ్ కంపెనీని ఏపీకి తరలిస్తున్నారా? ఇందులో నిజమెంత..
రాష్ట్ర వ్యాప్తంగా 12 దుకాణాలకు ఒక్కొక్క దరఖాస్తు మాత్రమే దాఖలు కాగా.. 46 దుకాణాలకు రెండు చొప్పున, 57 దుకాణాలకు మూడు చొప్పున, 79 చోట్ల నాలుగు, 115 దుకాణాలకు ఐదు చొప్పున దరఖాస్తులు దాఖలయ్యారు. రెండేసి దారఖాస్తులు దాఖలైన 21 దుకాణాలు తాడిపత్రి నియోజకవర్గంలోనే ఉన్నాయి. తిరుపతి జిల్లాలో 12 దుకాణాలకు రెండేసి దరఖాస్తులు దాఖలురాగా.. వాటిలో నాలుగు చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఎక్కువ దుకాణాలకు మూడు నుంచి నాలుగు లోపే దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
శ్రీకాళహస్తి మున్సిపాలిటీలోని 56 నుంచి 61వ నెంబర్ వరకు ఉన్న దుకాణాలకు మూడేసి దరఖాస్తులే వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో చెల్లూరు పెండ్లిమర్రి కమలాపురం గ్రామీణ మండలాల్లో దుకాణాలకు రెండేసి దరఖాస్తులే దాఖలయ్యాయి. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కిలికిరి మండలంలోని 100, 101, 102 దుకాణాలకు రెండేసి దరఖాస్తులే వచ్చినట్లు అధికారులు గుర్తించారు. హిందూపురం మున్సిపాలిటీలోని పలు దుకాణాలకు మూడేసి దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి కృష్ణ జిల్లాలోని గుడివాడ, గన్నవరం నియోజకవర్గంలోని అనేక దుకాణాలకు నాలుగేసి దరఖాస్తులే దాఖలైనట్లు అధికారులు తెలిపారు.