Chandrababu : మద్యం కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
Chandrababu Bail Plea : షాప్ అనుమతులు, లైసెన్స్ ల విషయంలో చంద్రబాబుకు సంబంధం లేదని ఆయన వాదనలు వినిపించారు.

Chandrababu Bail Plea (Photo : Google)
మద్యం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నాగమూర్తి వర్చువల్ లో వాదనలు వినిపించారు. లిక్కర్ పాలసీలో అప్పట్లో కొంతమంది లిక్కర్ షాప్, బార్ ఓనర్లు ఇచ్చిన ప్రివిలేజస్ ను కేబినెట్ ఆమోదించిందని నాగమూర్తి కోర్టుకు తెలిపారు. తర్వాత అసెంబ్లీలో కూడా ఆమోదం పొందిందన్నారు. ప్రొహిబిషన్ ఎక్సైజ్ కమిషనర్ గా ఉన్న నరేష్ అనుమతులపై నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. షాప్ అనుమతులు, లైసెన్స్ ల విషయంలో చంద్రబాబుకు సంబంధం లేదని ఆయన వాదనలు వినిపించారు.
Also Read : విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం.. నేతల పరామర్శలు.. నేనొస్తున్నానంటూ పవన్ ట్వీట్
”లైసెన్స్ దారులు విజ్ఞప్తి మేరకు ఏకకాలంలో చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజులను దశల వారీ చెల్లించేలా కేబినెట్ ఆమోదించింది. తర్వాత ఈ నిర్ణయాన్ని అసెంబ్లీ ఆమోదించింది. ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదు. సీఐడీ చేసిన అభియోగాలపై ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. రాజకీయ కక్షతో వరుస కేసుల్లో 7వ నెంబర్ కేసుగా ఈ కేసును నమోదు చేశారు. 25 షాపులకు ఇచ్చిన ప్రత్యేక అనుమతుల్లో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదు. 17A అమెండ్ మెంట్ యాక్ట్ ఈ కేసుకు వర్తిస్తుందిస” అని న్యాయవాది నాగమూర్తి తన వాదనలు వినిపించారు. ఇక, ఈ కేసులో సీఐడీ రేపు (నవంబర్ 22) మధ్యాహ్నం 2గంటల 15 నిమిషాలకు తన వాదనలు వినిపించనుంది.
Also Read : హైకోర్టు తీర్పు వైసీపీకి చెంపపెట్టు, చంద్రబాబుకి క్షమాపణ చెప్పాలి- పయ్యావుల కేశవ్