Lizard in Sambar : ఇడ్లీ సాంబార్ లో బల్లి..చిన్న బల్లి పడితే ఏం కాదు తినేయమన్న హోటల్ యాజమాన్యం
ఓ హోటల్ కు వెళ్లి ఇడ్లీ సాంబార్ తింటున్న కష్టమర్లు షాక్ అయ్యారు. ఇడ్లీ సాంబార్ లో బల్లి పడి ఉంది. అదే విషయాన్ని హోటల్ యాజమాన్యాన్ని నిలదీయగా ..చిన్న బల్లి పడితే ఏం కాదు తినేయమంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. దీంతో కష్టమర్లు మండిపడ్డారు.

Lizard in Idli Sambar..In Andrapradesh Nandyala Hotel
Lizard in Idli Sambar..In Ap Nandyala Hotel : ఏపీనిలో కర్నూలు జిల్లాలోని నంద్యాలలో ఓ హోటల్ కు వెళ్లిన కొంతమంది కష్టమర్లు ఎంతో ఇష్టంగా తిందామని ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఇచ్చారు. సర్వర్ తెచ్చిచ్చాడు. హాయిగా తిందామని చూసేసరికి సాంబార్ లో బల్లి కనిపించింది. అంతే ఒక్కసారిగా వారు షాక్ అయ్యారు. అదే విషయాన్ని హోటల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. దానికి యాజమాన్యం లైట్ తీస్కోండి..ఓ చిన్న బల్లి పడితే ఏమవుతుంది? అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఆ సమాధానికి కష్టమర్లు షాక్ అయ్యారు.
అయ్య బాబోయ్..ఉల్లి పకోడీలో కప్ప..!!
హోటల్ యాజమాన్యంతో వాగ్వాదం పెట్టుకున్నారు. ఇలా కష్టమర్ల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటారా? పొరపాటు జరిగింది అని కనీసం సమాధానం చెప్పకుండా ఇంత నిర్లక్ష్యంగా సమాధానం చెబుతారా? డబ్బులేమన్నా ఊరికే వస్తున్నాయా? డబ్బులు మాట ఎలా ఉన్నా..ప్రజల ఆరోగ్యాలతో చెలాగాటాలు ఆడతారా? అని ప్రశ్నించారు. కానీ హోటల్ యాజమాన్యం మాత్రం తాపీగా అదే నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించింది. దీంతో కష్టమర్లు మరింతగా ఆగ్రహం వ్యక్తంచేస్తు ఫుడ్ ఇన్ స్పెక్టర్లు కూడా హోటల్ పై దష్టి పెట్టటంలేదని అందువల్లే ఇటువంటివారి ఆగడాలు చెల్లుతున్నాయంటూ వాపోయారు.
Frog In patient Idli : ప్రభుత్వ ఆస్పత్రిలో రోగి ఇడ్లీ పార్సిల్‌లో కప్ప కళేబరం..