Nara Lokesh: పవన్ కల్యాణ్ సవాల్‌ను స్వీకరిస్తున్నా: నారా లోకేశ్ ప్రకటన
గత వైసీపీ హయాంలో స్టూడెంట్లకు నాణ్యతలేని యూనిఫాంలు ఇచ్చారని తెలిపారు.

అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ అన్నారు. మోదీ పిలుపు మేరకు ఏపీలో కోటి మొక్కలు నాటాలని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సవాల్ విసిరారని చెప్పారు. ఆయన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నని, విద్యాశాఖ ద్వారా కోటి మొక్కలు నాటుతామని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎం 2.0 మీటింగ్‌లో పాల్గొన్న లోకేశ్ ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లకు దీటుగా సర్కారీ బడులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. గవర్నమెంట్ స్కూళ్లలో విద్యతో పాటు ఆటలు, పాటలు, యోగా నేర్పిస్తున్నామన్నారు.
Also Read: బాహుబలి ఫ్యాన్స్‌కు పండగే.. పదేళ్ల తర్వాత రాజమౌళి మరో సంచలనం.. రెండు భాగాలు కలిపి ఒకే సినిమాగా రీరిలీజ్..
ప్రతి సక్సెస్ వెనుక గురువు ఉంటారని, మన ఎదుగుదలను కోరుకుంటారని లోకేశ్ అన్నారు. అలాగే, మనకు నడకను, బాధ్యతలను అమ్మ నేర్పిస్తుందని తెలిపారు. అమ్మ పట్ల గౌరవాన్ని పెంచడానికే తల్లికి వందనమని అన్నారు. టెన్త్, ఇంటర్ స్టూడెంట్స్ బాగా రాణిస్తున్నారని తెలిపారు. నిరుపేద కుటుంబాల పిల్లలకు ఆర్థిక సాయం చేశామని చెప్పారు. గత వైసీపీ హయాంలో స్టూడెంట్లకు నాణ్యతలేని యూనిఫాంలు ఇచ్చారని తెలిపారు.
కాగా, శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలోని కొత్తచెరువు జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన మీటింగ్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు. ఉపాధ్యాయుడిగా మారి స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పారు. ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ స్కూళ్లలో ఇవాళ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది.