AP Heavy Rainfall : బలహీనపడిన అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు.. అన్ని పోర్టులకు ప్రమాద హెచ్చరిక!
AP Heavy Rainfall : నెల్లూరు జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో ఏపీలోని అన్ని పోర్టులకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

Well marked low pressure to weaken
AP Heavy Rainfall : ఏపీ రాష్ట్రంలో భారీగా వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలోనూ హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ముసురు వాతవారణం కనిపిస్తోంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం కొద్దిసేపటి క్రితమే బలహీనపడింది. ప్రస్తుతం ఈ అల్పపీడనం మరింత బలహీనపడి ఉపరిత ఆవర్తనంగా కొనసాగుతోంది. ఆవర్తన ప్రభావంతో కోస్తా తీరం వెంబడి భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి.
గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో ఏపీలోని అన్ని పోర్టులకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈ ప్రతికూల వాతావరణ సమయంలో మత్స్యకారులను వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read Also : Pothina Venkata Mahesh : అలాంటి వ్యక్తులతో వంగవీటి రాధా చేతులు కలపడం దురదృష్టకరం- పోతిన మహేశ్