Cruise Tour: విశాఖలో అందుబాటులోకి లగ్జరీ క్రూయిజ్ షిప్ ప్రయాణం: వైజాగ్ టూ చెన్నై నౌకా విహారం

విశాఖ నగర వాసులతో పాటు..తెలుగు రాష్ట్రాల్లోని పర్యాటకులను ఎప్పటి నుంచో ఊరిస్తున్న లగ్జరీ క్రూయిజ్ షిప్ ప్రయాణం అతిత్వరలో సాక్షాత్కారం కానుంది.

Cruise Tour: విశాఖలో అందుబాటులోకి లగ్జరీ క్రూయిజ్ షిప్ ప్రయాణం: వైజాగ్ టూ చెన్నై నౌకా విహారం

Cruise

Updated On : May 29, 2022 / 7:30 PM IST

Cruise Tour: విశాఖ నగర వాసులతో పాటు..తెలుగు రాష్ట్రాల్లోని పర్యాటకులను ఎప్పటి నుంచో ఊరిస్తున్న లగ్జరీ క్రూయిజ్ షిప్ ప్రయాణం అతిత్వరలో సాక్షాత్కారం కానుంది. అందమైన విశాఖ నగరంలో విలాసవంతమైన నౌకా విహారం అందుబాటులోకి రానుంది. టూరిస్ట్ క్రూయిజ్ షిప్ లకు విశాఖ పోర్టు అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో జూన్ 8న ఎంప్రెస్ టూరిస్ట్ షిప్ అనే భారీ లగ్జరీ క్రూయిజ్ షిప్ విశాఖ పోర్టుకు చేరుకోనుంది. క్రూయిజ్ పర్యటనల నిమిత్తం జేఎం భక్షి అనే సంస్థకు పోర్టు అధికారులు అనుమతులు ఇచ్చారు. దీంతో చెన్నై నుంచి జూన్ 8న పర్యాటకులతో మొట్టమొదటి క్రూయిజ్ షిప్ విశాఖ పోర్టుకు చేరుకోనుంది.

other stories: Char Dham Yatra: 25 రోజుల్లో 99 మంది చార్‌ధామ్ యాత్రికులు మృతి.. ఎందుకిలా జ‌రుగుతుందంటే..

ఆ రోజు నగరంలోని పలు పర్యాటక ప్రాంతాలు, సందర్శనీయ స్థలాలను చూపించి తిరిగి అదే రోజు సాయంత్రం 8 ఘటనలకు తిరిగి విశాఖ పోర్టు నుంచి బయలుదేరనుంది. చెన్నై – పుదుచ్చేరి – విశాఖ మీదుగా ప్రయాణం సాగనుంది. జూన్ 8న సాయంత్రం 8 గంటలకు వైజాగ్ పోర్టు వీడనున్న ఎంప్రెస్ క్రూయిజ్ షిప్..జూన్ 10న పుదుచ్చేరి చేరుకుంటుంది. అనంతరం జూన్ 11 ఉదయం పుదుచ్చేరి నుంచి చెన్నైకి బయలుదేరుతుంది. తిరిగి జూన్ 15న 22న ఎంప్రెస్ క్రూయిజ్ షిప్ విశాఖ పర్యటనకు రానుంది. ఇక క్రూయిజ్ షిప్ లో విహరించాలనుకునే పర్యాటకులు తాము ఎంచుకునే సర్వీస్, ప్యాకెజీని బట్టి చార్జీలు ఉంటాయి. ఒకేసారి 1800 మంది ప్రయాణించవచ్చు. ప్రస్తుతం విశాఖ – చెన్నై టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

other stories: Ants find Gold: చీమలు చెప్పిన బంగారు గని రహస్యం: బీహార్‌లో బంగారం ఎలా బయటపడింది