Maredumilli encounter : మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో బిగ్ ట్విస్ట్.. ఎస్ఐబీ అదుపులో మావోయిస్టు అగ్రనేతలు దేవ్ జీ, ఆజాద్..?
Maredumilli encounter : మావోయిస్టు నేతల ఎన్‌కౌంటర్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసు బలగాల అదుపులో దేవ్ జీ, ఆజాద్ లు ప్రాణాలతోనే ఉన్నారని సమాచారం.
Encounter
Maredumilli encounter : మావోయిస్టు నేతల ఎన్‌కౌంటర్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బుధవారం ఉదయం ఏవోబీలో ఎన్‌కౌంటర్ జరిగింది. మారేడుమిల్లి మండలం జీఎంవలస సమీపంలో ఈ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. అయితే, ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్ర నేతలు దేవ్ జీ, ఆజాద్ లు కూడా మరణించారని తొలుత వార్తలు వచ్చాయి, కానీ, పోలీసులు విడుదల చేసిన మృతుల వివరాల్లోకి వారి పేర్లు లేకపోవటంతో వారిద్దరు ఎక్కడున్నారు..? బతికే ఉన్నారా..? అనే చర్చ జరుగుతుంది. అయితే, దేవ్ జీ, ఆజాద్‌లు ఎస్ఐబీ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.
పోలీసు బలగాల అదుపులో దేవ్ జీ, ఆజాద్ లు ప్రాణాలతోనే ఉన్నారని సమాచారం. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జి, కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్‌లు ప్రస్తుతం మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ నేతలుగా ఉన్నారు. వీరిని గత పదిహేను రోజుల క్రితమే ఎస్ఐబి పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు పార్టీలోని అగ్రనేతలు హతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల పోలీసుల ప్రమేయంతో ఎస్ఐబీ పోలీసుల విచారణ కొనసాగుతుంది. లొంగుబాటు ఎత్తుగడతో మావోయిస్టు శ్రేణులు అబూజ్ మడ్‌ను వీడాయని, కీలక వ్యక్తి మధ్యవర్తిత్వంతో పోలీసు బలగాలకు మావోయిస్టు శ్రేణులు టచ్‌లోకి వెళ్లినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోయేందుకు ఆజాద్ అలియాస్ కొయ్యడ సాంబయ్య అబూజ్ మడ్‌ను వదిలినట్లు సమాచారం.
దేవ్ జీ, ఆజాద్‌లు పోలీసుల అదుపులోనే ఉన్నారా..? వాళ్లు అసలు బతికే ఉన్నారా.. బతికే ఉంటే వాళ్లు ఎక్కడ ఉన్నారు? అనే అంశాలపై చర్చ జరుగుతుంది. ఒకవేళ పోలీసుల అదుపులో ఉంటే వారిని రిమాండ్ చేస్తారా..? లేదంటే మరో ఎన్ కౌంటర్ కొనసాగుతుందా..? అనేది తీవ్ర ఉత్కంఠతను రేపుతోంది.
