Amabati Rambabu : నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది, కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి- మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
రూ.50 లక్షలు ఖర్చు పెట్టి నన్ను ఏసేస్తాం అన్నారు. ఈరోజు నాపై దాడికి వచ్చిన వారంతా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. Ambati Rambabu

Ambati Rambabu On Khammam Incident
Ambati Rambabu On Khammam Incident : తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఏపీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకోసం ఖమ్మంలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని ఆయన చెప్పారు. నిన్న నా కారుకు యాక్సిడెంట్ జరిగింది, దాని వెనుక కుట్ర ఉందేమో అని అంబటి రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఖమ్మం పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. నాపై జరిగిన దాడి వెనుక కుట్ర ఏమైనా ఉందా? అనే కోణంలో విచారణ జరిపించాలన్నారు.
ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఖమ్మం వెళ్లిన అంబటి రాంబాబును టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంబటికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్రలు చూపిస్తూ ఆయనను హెచ్చరించారు. ఖమ్మం ఘటనపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read : జైలులో భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాసిన చంద్రబాబు
ఈ కులోన్మాదంతోనే రంగాను చంపేశారు..
”ఖమ్మంలో నాపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం చెయ్యడానికి ప్రయత్నం చేశారు. కర్రలతో వచ్చి దాడికి యత్నం చేశారు. నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. బూతులు తిట్టారు. అందరం చందాలు వేసుకుంటున్నాం. నిన్ను ఏసేస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. ఏడాది క్రితం కార్తీక మాస సమావేశంలో ఇలానే రూ.50 లక్షలు ఖర్చు పెట్టి నన్ను ఏసేస్తాం అన్నారు. ఈరోజు నాపై దాడికి వచ్చిన వారు అంతా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు దొరకలేదు. ఆ కులానికి ఏంటీ కులోన్మాదం? ఇలాంటి కులోన్నాదంనే వంగవీటి రంగాను హతమార్చారు. ముద్రగడ పద్మనాభంను చిత్రహింసలు పెట్టారు. ప్రజాస్వామ్యంలో ఓ మంత్రిపై ఈ దాడుల ప్లాన్ ఏంటి..? నాపై జరిగిన దాడి వెనుక కుట్ర ఏమైనా ఉందా విచారణ చెయ్యాలి. నిన్న నా కార్ కు యాక్సిడెంట్ జరిగింది. దాని వెనుక కుట్ర ఉందేమో? ఖమ్మం పోలీసులకు ఫిర్యాదు చేస్తా.
నేనెప్పుడూ అసభ్యకరంగా, సంస్కారహీనంగా మాట్లాడలేదే..
ఖమ్మంలో టీడీపీ నేతలు నాపై దాడికి యత్నించారు. దాడులు చేస్తే చేతులు కట్టుకుని కూర్చోం. మీకే కాదు మాకూ కులాలు ఉన్నాయి. ఉన్మాదంతో మీరు చేస్తున్న పనులు మీకే ప్రమాదం అని గుర్తు పెట్టుకోండి. నేను ఎప్పుడూ ఎవరినీ అసభ్యంగా మాట్లాడలేదు. ఎన్నడూ సంస్కారహీనంగా మాట్లాడలేదు. నేను మాట్లాడే మాటలు ఘాటుగా, సూటిగా ఉంటాయి. అది మీకు బాధగా ఉంటుంది. అలా మాట్లాడినందుకు నాపై దాడులు చేస్తారా? నన్ను ఎలిమినేట్ చేస్తారా? చందాలు వేసుకుంటారా? చందాలు వేసుకుని మనుషులను లేపేస్తారా? వంగవీటి మోహన రంగాను లేపేసినట్లు. ఏంటీ దారుణం. ఏ సమాజంలోకి పోతున్నాం మనం. నన్ను టార్గెట్ చేసినా లెక్క చేసే వ్యక్తిని కాదు. అనేకసార్లు నన్ను టార్గెట్ చేశారు. నేను ఎక్కడా తప్పు చేయలేదు” అని మంత్రి అంబటి రాంబాబు తేల్చి చెప్పారు.
Also Read : జైల్లో వ్యక్తులను జగన్ అండ్ టీం సైలెంటుగా చంపేస్తారు.. చంద్రబాబు భద్రతపై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబుకి బెయిల్ రావాలంటే అదొక్కటే మార్గం..
చంద్రబాబు రోజుకొకటి చెప్పి బెయిల్ కోసం పాకులాడుతున్నారు. జైలులో ప్రాణహాని ఉండటం ఏంటి..? జైలులో పూర్తి భద్రత ఉంది. చంద్రబాబు కదలికలను రికార్డ్ చేయాల్సిన అవసరం ఏముంటుంది..? చర్మ వ్యాధి వల్ల కూల్ వాతావరణం ఏర్పాటు చేశారు. కోర్టులో పిటిషన్లు వెయ్యగానే అయిపోదు. విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటారు. చంద్రబాబు ఆందోళన.. భద్రత, ఆరోగ్యంపై కాదు. పార్టీ గురించి ఆందోళన. చంద్రబాబుకి బెయిల్ రావాలి అంటే ఏపీ శ్రీనివాస్ ను పిలిపించి కోర్టులో సరెండర్ చెయ్యాలి. ఏ లాయర్ వచ్చినా ఏమీ అవ్వదు. ఇదొక్కటే మార్గం. కోట్ల రూపాయలు చంద్రబాబు కోసం కాదు. మమల్ని ఎలిమినేట్ చెయ్యడానికి ఖమ్మంలో చేతులు మారుతున్నాయి” అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
Also Read : మంత్రి అంబటి రాంబాబు కారుకు తప్పిన ప్రమాదం