వైసీపీ ప్రభుత్వంపై ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు బొత్స స్ట్రాంగ్ కౌంటర్
పురంధేశ్వరి కొంతమంది అధికారుల పేర్లు ఇస్తే ఎలక్షన్ కమిషన్ వారిని మార్చేస్తుంది.. ఇది చాలా దారుణం అంటూ బొత్స అన్నారు.

Botsa Satyanarayana
Botsa Satyanarayana : వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని ప్రశాంత్ కిషోర్ డబ్బా కొడుతున్నాడు. చంద్రబాబు అన్ని రంగాలను మేనేజ్ చేసేవాడు. అందుకే ఆయన హయాంలో అన్ని రంగాలు వెనకబడ్డాయి, జగన్ పరిపాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందింది. అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారని అన్నారు. ప్రశాంత్ కిశోర్ ను బీహార్ నుంచి తరిమికొట్టారు. ఇక్కడికి వచ్చి ఇష్టంవచ్చినట్లు మాట్లాడకు అంటూ బొత్స సూచించారు.
Also Read : Pothina Mahesh : నా వద్ద ఆధారాలున్నాయ్.. అన్నీ బయటపెడతా.. పవన్ కల్యాణ్ పై పోతిన మహేశ్ సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు ఎప్పుడూ అమరావతిని ఎలా దోచుకోవాలి.. తన సామాజిక వర్గానికి భూములను ఎలా కట్టబెట్టాలో ఆలోచించాడు. చంద్రబాబు ప్రజలకోసం ఎప్పుడు ఆలోచన చేయనే లేదు. జగన్ మాత్రం ఎప్పుడూ ప్రజలకు ఎలా మంచి చెయ్యాలనే ఆలోచన చేస్తాడు. చంద్రబాబుకు ప్రశాంత్ కిషోర్ సన్నాయి నొక్కునొక్కుతున్నాడు. ప్రశాంత్ కిశోర్ మా దగ్గర ఐదు సంవత్సరాలు ఉన్నాడు.. ఆయన ఆలోచనలు ఎలా వుంటాయో మేము చూశాకదా అంటూ బొత్స వ్యాఖ్యానించారు. పురంధేశ్వరి కొంతమంది అధికారుల పేర్లు ఇస్తే ఎలక్షన్ కమిషన్ వారిని మార్చేస్తుంది.. ఇది చాలా దారుణం అంటూ బొత్స అన్నారు. పవన్ కల్యాణ్ మాటమీద నిలబడేతత్వం లేని మనిషి, ఈ రోజు ఒకమాట.. రేపు ఒకమాట మాట్లాడతాడు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడను. షర్మిల కడుపులో ఏ బాధఉందో నాకేమీ తెలుసు? ఆమె గురించి నేనేమీ మాట్లాడను అని బొత్స అన్నారు.