శ్రీకాకుళానికి నేను చేసిన అభివృద్ధి ఎవరూ చేయలేదు.. విజ్ఞతతో ఆలోచించాలి : ధర్మాన ప్రసాదరావు

ఎక్కడినుంచో వచ్చి శ్రీకాకుళం జిల్లాలో అజమాయిషీ చేస్తామనుకుంటారు. అలాంటివి అవమానంగా భావిస్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు.

శ్రీకాకుళానికి నేను చేసిన అభివృద్ధి ఎవరూ చేయలేదు.. విజ్ఞతతో ఆలోచించాలి : ధర్మాన ప్రసాదరావు

Dharmana Prasada Rao

Dharmana Prasada Rao : ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హాట్ కామెంట్స్ చేశారు. సోమవారం శ్రీకాకుళంలో  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు అవినీతికి దూరంగా ఉండాలని.. ఒకరి ఆస్తికోసం కక్కుర్తి పడే మనస్తత్వం ఉండకూడదని అన్నారు. నాయకుడు అవినీతి చేయకూడదు.. ఎవరు చేస్తామన్నా చెయనివ్వకూడదు. కచ్చితంగా ఇవి నేను పాటిస్తా అంటూ ధర్మాన ప్రసాద్ రావు అన్నారు. శ్రీకాకుళానికి తాను చేసిన అభివృద్ధి ఎవరూ చేయలేదని పేర్కొన్నారు.

Also Read : Chandrababu Naidu : బుజ్జగింపులు.. రోజంతా బిజీబిజీగా చంద్రబాబు

ఎక్కడినుంచో వచ్చి శ్రీకాకుళం జిల్లాలో అజమాయిషీ చేస్తామనుకుంటారని.. అలాంటివి అవమానంగా భావిస్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ”శ్రీకాకుళంలో వనరులున్నాయనే పక్క జిల్లాల నుంచి వచ్చేస్తున్నారు. ఇలా వదిలేస్తే రౌడీల మయం అయిపోతుంది. రౌడీల చేతిలోకి వెళ్లిపోతుంది. మిగతా ప్రాంతాలు ఇలానే పాడైపోతున్నాయి. ప్రశాంతంగా పట్టణాలు ఉండాలని ధర్మాన అన్నారు. దశాబ్దాలుగా శ్రీకాకుళం ప్రశాంతంగా ఉండాలనే చూస్తున్నా.. ఇన్ని చేసినా నేను పనికి రాకపోతే మీ ఇష్టం.. మీ విజ్ఞతతో ఆలోచించండి.

Also Read : అసంతృప్తుల ఆగ్రహ జ్వాల.. టీడీపీలో ఫస్ట్ లిస్ట్ మంటలు, రోడ్డెక్కిన ఆశావహులు

మీ అభిమానంతోనే గెలుస్తూ వస్తున్నా. జిల్లాలో ఎక్కడైనా నేను గెలుస్తా.. కానీ, శ్రీకాకుళంలో వేరేవారు గెలవరు. మిగతావారు కనీసం అభివృద్ధి కూడా చేయలేరు. గెలిస్తే శక్తివంతంగా ఉంటా.. ఓడిపోతే స్నేహితుడుగా ఉంటా.. కానీ, శక్తిహీనుడునైపోతా” అంటూ ధర్మా కీలక వ్యాఖ్యలు చేశారు.