Dharmana Prasada Rao : దద్దమ్మ నువ్వా? నేనా? ప్రజలే నిర్ణయిస్తారు-అచ్చెన్నాయుడుకు మంత్రి ధర్మాన స్ట్రాంగ్ కౌంటర్

అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి జైకొట్టిన అచ్చెన్నాయుడు తనను దద్దమ్మ అనటం విడ్డూరంగా ఉందన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటును ప్రశ్నించలేకపోయిన అచ్చెన్నాయుడు దద్దమ్మా? లేక నేనా? అన్నది ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు మంత్రి ధర్మాన.

Dharmana Prasada Rao : దద్దమ్మ నువ్వా? నేనా? ప్రజలే నిర్ణయిస్తారు-అచ్చెన్నాయుడుకు మంత్రి ధర్మాన స్ట్రాంగ్ కౌంటర్

Updated On : October 10, 2022 / 5:38 PM IST

Dharmana Prasada Rao : రాజధాని అంశం ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచింది. అధికార, విపక్షాల మధ్య రాజధాని రగడ కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. వీరి మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.

విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలపై మండిపడ్డారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఉత్తరాంధ్రలో బతుకు పోరాటం చేస్తుంటే, అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి జైకొట్టిన అచ్చెన్నాయుడు తనను దద్దమ్మ అనటం విడ్డూరంగా ఉందన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మంత్రిగా ఉండి కూడా ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థను శ్రీకాకుళం తీసుకురాలేని అచ్చెన్న.. ఇప్పుడు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తుంటే అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ధర్మాన. ఉత్తరాంధ్ర వెనుకబాటును ప్రశ్నించలేకపోయిన అచ్చెన్నాయుడు దద్దమ్మా? లేక నేనా? అన్నది ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు మంత్రి ధర్మాన.