Gudivada Amar Nath : ఆ విషయంలో గుజరాత్ తరువాత స్థానంలో ఏపీయే : మంత్రి

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అందుకే లేనిపోని విమర్శలు చేస్తున్నాయి అంటూ ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.

Gudivada Amar Nath : ఆ విషయంలో గుజరాత్ తరువాత స్థానంలో ఏపీయే : మంత్రి

Gudivada Amar Nath

Minister Gudivada Amar Nath : ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అందుకే లేనిపోని విమర్శలు చేస్తున్నాయి అంటూ ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతు..పెట్టుబడుల విషయంలో గుజరాత్ తరువాత తరువాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక వేత్తలు ఏపీ వైపు చూస్తున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టును 70 శాతం కట్టామని చంద్రబాబు అంటున్నారు..కానీ చంద్రబాబు 70శాతం కట్టలేదు..70 శాతం కొట్టేశారు అంటూ ఎద్దేవా చేశారు.

పవన్ కల్యాణ్ ను నాదెండ్ మనోహర్ తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేవారికి భూములు కేటాయిస్తే కూడా అవినీతి చేస్తున్నారని భూములు దోచేస్తున్నారు అంటూ విమర్శిస్తున్నారు. పెట్టుబడులు పెట్టేవారికి భూములు కేటాయిస్తే తప్పేంటీ..? అంటూ ప్రశ్నించారు.

నాది, పవన్ కళ్యాణ్ ది ఒకటే భావజాలం.. దేనికీ భయపడని వ్యక్తిత్వం : ఎమ్మెల్యే బాలకృష్ణ

కాగా..ఏపీలో అభివృద్ధి లేదు అప్పులు తప్ప అంటూ విపక్షాలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాము విధానపరమైన సమస్యల గురించి ప్రశ్నిస్తుంటే వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు దిగుతున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ తాము చేసిన అభివృద్ధి కనిపించటంలేదా..? అంటూ ఏపీకి పెట్టుబడుల వెల్లువ వస్తోంది అంటూ ప్రభుత్వం ఇలా విమర్శలు, ప్రతి విమర్శలతో ఏపీలో రాజకీయ వేడెక్కుతున్నాయి.