జగన్ దమ్మున్న నాయకుడు..మండలి అవసరమా – కన్నబాబు

దమ్మున్న నేతగా జగన్ సభా నాయకుడిగా ఉన్నారు..కాబట్టి మండలిలో జరిగిన పరిణామాలపై ఇప్పుడు నిర్ణయం చేయలేకపోతే ఎప్పడూ చేయలేము..మండలి అవసరమా అని ప్రశ్నించారు మంత్రి కన్నబాబు. ఏపీ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. 2020, జనవరి 23వ తేదీ గురువారం శాసనసభలో పలు బిల్లులను ఆమోదింప చేసింది. అనంతరం శాసన మండలిలో జరిగిన పరిణామాలపై శాసనసభ చర్చించింది.
మండలి ఛైర్మన్ వ్యవహరించిన తీరును తప్పుబట్టారు మంత్రులు. భవిష్యత్‌లో కుట్రలు, కుతంత్రాలకు సభలు వేదిక కాకుడదంటే..ఈ వ్యవహారాన్ని పార్లమెంట్ ప్రోసీజర్స్ చూసే వారికి నివేదించాలన్నారు. బాబు బెదిరింపులకు భయపడని ఒకే ఒక వ్యక్తి జగన్ అని అన్నారు. మంత్రులు తాగేసి వచ్చారని యనమల అంటున్నారని, వీరికి కండకావురమా ? ఏంటీ బెదిరింపులు ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శాసనసభ్యులను కించపరిచే విధంగా మాట్లాడిన వ్యక్తులను సభకు పిలిపించే నిర్ణయం స్పీకర్ తీసుకోవాలన్నారు. కొత్త విదానాలను ప్రవేశ పెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. ఏం సాధించారని టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని సభలో ప్రశ్నించారు.
మండలి ఛైర్మన్ విచక్షణాధికారాలపై చర్చ జరగాలన్నారు. కుట్రలు, కుతంత్రాలతో బాబు వ్యవహరిస్తున్నారని, బాబు కూర్చొని ఛైర్మన్‌పై ప్రభావితం చూపారని తెలిపారు. కింద నారా లోకేష్ కూర్చొని వీడియోలు, ఫొటోలు తీశారని, కుడి భుజంగా ఉన్న యనమల..ఇలా వీరంతా చేసిన డ్రామా..అంతా ఇంతా కాదన్నారు. ఇలా అయితే..రూల్స్ ఎందుకు ? బుక్స్ ఎందుకు ? రాజ్యాంగం ఎందుకు ? అని ప్రశ్నించారు.
బాబు ఒక అల్లా అని గతంలో స్టేట్ మెంట్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ ఛైర్మన్ స్థానంలో కూర్చొన్న తర్వాత..ఇలా వ్యవహరించ వచ్చా అని నిలదీశారు. పెద్దలు కూర్చొని చర్చించి..అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ జరిగే విధంగా చూడాలని అన్నారు మంత్రి కన్నబాబు.
Read More : మండలి ఛైర్మన్‌కు ఆ హక్కు లేదు : బాబు అక్కడే ఎందుకు కూర్చొన్నారు