కియా కార్ల నూతన షోరూం ప్రారంభం.. మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు

మంగళగిరి నియోజకవర్గం కొలనుకొండలో నూతన కియా కార్ల షోరూంను నారా లోకేశ్ ప్రారంభించారు. రోజుకు 70కార్ల సర్వీస్ చేసేలా ఆధునిక వసతులతో షోరూం ఏర్పాటు చేశారు.

కియా కార్ల నూతన షోరూం ప్రారంభం.. మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు

nara lokesh

Updated On : October 11, 2024 / 12:36 PM IST

Minister Nara Lokesh : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గం కొలనుకొండలో నూతన కియా కార్ల షోరూంను నారా లోకేశ్ ప్రారంభించారు. రోజుకు 70కార్ల సర్వీస్ చేసేలా ఆధునిక వసతులతో షోరూం ఏర్పాటు చేశారు. ఈ షోరూం ప్రారంభ కార్యక్రమంలో కార్యక్రమంలో మంత్రులు మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి, కొలుసు పార్థసారథి, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నీ, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నారా లోకేశ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: AP liquor shop Tenders: ఏపీలో మద్యం దుకాణాల టెండర్లకు లాస్ట్ డే.. ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?

టీసీఎస్ ని ఒప్పించి ప్రభుత్వం ఏర్పడిన 120 రోజుల్లోనే పెట్టుబడులు పెట్టేలా చేయటంతో సంతృప్తి చెందట్లేదని, ఇచ్చిన హామీ మేరకు 20లక్షల ఉద్యోగాలు కల్పించి తీరుతామని నారా లోకేశ్ అన్నారు. భారతదేశంలో ఎక్కడ కియా కారు కనిపించినా మేడ్ ఇన్ ఆంధ్రా కారు అని గర్వంగా చెప్పుకుంటున్నామని అన్నారు. పంటలు పండించలేని ప్రాంతంలో కార్లు పరిగెత్తించిన ఘనత చంద్రబాబుది.. కియా వల్ల ఒక్క అనంతపురం జిల్లాలోనే తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని లోకేశ్ చెప్పారు.

Also Read: Gold and silver Price: పండుగ వేళ షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో 10గ్రాముల గోల్డ్ రేటు ఎంతంటే?

విజన్ ఉన్న నాయకుడికి, విజన్ లేని నాయకుడికి మధ్య తేడా ప్రజలు గుర్తించాలని లోకేశ్ కోరారు. 2014-19 మధ్య 8లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని గత ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా చెప్పిందన్నారు. పెద్ద పరిశ్రమలను ఒప్పించి రాష్ట్రానికి తెస్తూనే, చిన్న పరిశ్రమల్ని ప్రోత్సహిస్తూ ఉపాధి కల్పనకు కృషి చేస్తామని లోకేశ్ చెప్పారు.