Peddi Reddy Ramachandra Reddy : నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా.. చంద్ర‌బాబుకు మంత్రి స‌వాల్‌

ఏపీలో రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరుపక్షాల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది.

Peddi Reddy Ramachandra Reddy : నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా.. చంద్ర‌బాబుకు మంత్రి స‌వాల్‌

Peddi Reddy Ramachandra Reddy

Updated On : January 8, 2022 / 8:30 PM IST

Peddi Reddy Ramachandra Reddy : ఏపీలో రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరుపక్షాల మధ్య చాలెంజ్ ల పర్వం నడుస్తోంది. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబుకి సవాల్ విసిరారు. కుప్పంలో తాను గ్రానైట్ అక్ర‌మ మైనింగ్ చేసిన‌ట్టు చంద్రబాబు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని స‌వాల్ విసిరారు మంత్రి పెద్దిరెడ్డి.

iPhone 12 Series : ఆపిల్ ఐఫోన్లపై భారీ తగ్గింపు.. రూ.10వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్..!

చంద్ర‌బాబు సీనియర్ ఎమ్మెల్యేగా ఉండి చిత్తూరు జిల్లాకు ఏం చేశారని మంత్రి ప్ర‌శ్నించారు. కుప్పంను అభివృద్ది చేయాల‌ని క‌ల‌లు క‌న్నట్టు చంద్రబాబు చెబుతారు, మరి 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశార‌ని మంత్రి నిలదీశారు. ఐదేళ్లలోనే వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు దేవుడయ్యార‌ని మంత్రి చెప్పారు. చంద్ర‌బాబు చిత్తూరు జిల్లాలో పుట్ట‌డం మ‌న దుర‌దృష్ట‌మ‌న్నారు. చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు మైనింగ్ రాయ‌ల్టీపై క‌న్ సెషన్ ఎందుకు ఇచ్చార‌ని మంత్రి పెద్దిరెడ్డి అడిగారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాబును తప్ప‌కుండా ఓడిస్తామ‌ని, ఇది త‌ప్ప‌కుండా జ‌రుగుతుంద‌ని మంత్రి అన్నారు. చంద్రబాబు ఎన్ని చెప్పినా చిత్తూరు జిల్లా ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని అన్నారు.

WhatsApp Update : వాట్సాప్ ఫ్యూచర్ అప్‌డేట్.. చాట్ లిస్టులో ఈ రెండు ఆప్షన్లు ఎత్తేస్తోంది..!

కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు.. అధికార పార్టీ నేతలపై ఫైర్ అవుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు టార్గెట్ చేసారు. కుప్పంలో వరుసగా జరిగిన స్థానిక సంస్థలు – మున్సిపల్ ఎన్నికల్లో తనను దెబ్బ తీసేందుకు ప్రయత్నించిన పెద్దిరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ పుంగనూరులో ఓడిస్తానని చంద్రబాబు శపధం చేశారు. దీనికి మంత్రి పెద్దిరెడ్డి సైతం ధీటుగానే కౌంటర్ ఇచ్చారు. కుప్పంలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించటం పెద్ద కష్టం కాదని ధీమా వ్యక్తం చేసారు. ఇక, కుప్పంలో చివరి రోజు పర్యటనలో.. పెద్దిరెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.

అక్రమ మైనింగ్ అంశంలో ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. అటవీ ప్రాంతంలో క్వారీలు నిర్వహిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. వైసీపీ నేతల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయిందని, క్వారీలకు కనీస అనుమతులు లేకుండా.. ఖనిజ సంపదను దోచుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేడని ధ్వజమెత్తారు. కుప్పం అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడే వారిని వదిలిపెట్టనని చంద్రబాబు హెచ్చరించారు.