తిరిగి దాడులు చేస్తాం.. చంద్రబాబుని తిరగనివ్వం : మంత్రి వార్నింగ్

చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాజధానిపై రాద్దాంతం చేస్తే రాష్ట్రంలో తిరగనివ్వమని మంత్రి హెచ్చరించారు. మా ఎమ్మెల్యేలపై దాడులు చేస్తే

  • Published By: veegamteam ,Published On : January 9, 2020 / 07:49 AM IST
తిరిగి దాడులు చేస్తాం.. చంద్రబాబుని తిరగనివ్వం : మంత్రి వార్నింగ్

Updated On : January 9, 2020 / 7:49 AM IST

చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాజధానిపై రాద్దాంతం చేస్తే రాష్ట్రంలో తిరగనివ్వమని మంత్రి హెచ్చరించారు. మా ఎమ్మెల్యేలపై దాడులు చేస్తే

చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాజధానిపై రాద్దాంతం చేస్తే రాష్ట్రంలో తిరగనివ్వమని మంత్రి హెచ్చరించారు. మా ఎమ్మెల్యేలపై దాడులు చేస్తే తిరిగి దాడులు చేస్తామన్నారు. ఇప్పటికైనా మారాలని చంద్రబాబుకి సూచించారాయన. చిత్తూరులో అమ్మఒడి పథకం ప్రారంభోత్సవంలో మంత్రి పెద్దిరెడ్డి ఈ కామెంట్స్ చేశారు.

రాజధానిపై ఎందుకు రాద్దాంతం చేస్తున్నారు అని చంద్రబాబుని ప్రశ్నించారు. కొన్ని వందల కుటుంబాలకు లాభం చేయడానికే చంద్రబాబు రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలా వద్దా అని చంద్రబాబుని నిలదీశారు. కర్నూలుకు జ్యుడీషియల్ కేపిటల్ ఇవ్వడం రాయలసీమకు మంచిదా కాదా అని అడిగారు. 40 ఏళ్ల ప్రయత్నం ఇవాళ ఫలించిందన్నారు. సీఎం జగన్ దాన్ని నెరవేర్చారని చెప్పారు.

రాష్ట్రంలో ఎంతో వెనుకబడిన ప్రాంతం ఉత్తరాంధ్రలోని విశాఖలో అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్ పెడితే చంద్రబాబుకి వచ్చిన ఇబ్బంది ఏంటని మంత్రి ప్రశ్నించారు. అమరావతి ప్రాంతంలో చంద్రబాబు వేల ఎకరాల కొన్నారని, వాటిని ఏ విధంగా అమ్ముకోవాలని చంద్రబాబు చూస్తున్నారని మంత్రి ఆరోపించారు. మా ఎమ్మెల్యేలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని..తిరిగి దాడులు చేస్తామని, వైసీపీ శ్రేణులు చంద్రబాబుని తిరగనివ్వరని మంత్రి హెచ్చరించారు. చేసిన తప్పులకు చంద్రబాబు ఇప్పటికైనా పశ్చాతాపం చెందాలన్నారు.