Roja : తప్పులను సరిదిద్దుకుని గెలిస్తేనే చరిత్రలో ఉంటారు- మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు
నేను ఒకటే చెప్పగలను. లైఫ్ లో అయినా చదువులో అయినా ఆటల్లో అయినా విజయం సాధించడానికి కృషి చేస్తూ ఉండాలి. Roja

Roja With Children
Roja With Children : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి జూనియర్ అంతర్ జిల్లా బాల్ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలను ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రారంభించారు. నగరిలో మూడు రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. పిల్లలతో కలిసి బ్యాడ్మింటన్ ఆడారు మంత్రి రోజా. అనంతరం వారికి కీలక విషయాలు చెప్పారు. ఆటల్లో ఆడినా, ఓడినా రికార్డుల్లో ఉంటారు. కానీ, తప్పులను సరిదిద్దుకుని గెలిస్తేనే చరిత్రలో ఉంటారు అని మంత్రి రోజా అన్నారు.
క్రీడల్లో రాణించడం వల్ల 10 మందికి స్ఫూర్తిగా నిలిచే అవకాశం లభిస్తుందన్నారు. యువతకి చదువుతో పాటు క్రీడలు చాలా ముఖ్యం అని చెప్పారు. ఇవాళ సక్సెస్ ఫుల్ గా ఉన్న వ్యక్తులు ఇదివరకు ఓడిపోయి, అందులో అనేక గుణపాఠాలు నేర్చుకొని మళ్లీ విజయం సాధించి ఉంటారని రోజా అన్నారు. పోరాడితే పోయేదేమీ లేదు కాబట్టి గెలవడానికి ప్రయత్నించండి అని పిల్లలకు సూచించారు మంత్రి రోజా.
”పిల్లలకి నేను ఒకటే చెప్పగలను. లైఫ్ లో అయినా చదువులో అయినా ఆటల్లో అయినా మీరు విజయం సాధించడానికి కృషి చేస్తూ ఉండాలి. ఒకసారి మిస్ అయిందని మనo వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈరోజు సక్సెస్ ఫుల్ గా ఉన్న వాళ్ళు అప్పుడప్పుడూ ఓడిపోయిన వారే. ఓడిపోవడానికి కారణాలు తెలుసుకొని రెట్టించిన ఉత్సాహంతో ఆ తప్పులను సరిదిద్దుకుని ముందుకు వెళితే ప్రతి ఒక్కరూ తప్పకుండా విజయం సాధిస్తారు.
యువత చిన్న చిన్న ఒత్తిళ్లు తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లడం, సూసైడ్ చేసుకోవడం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితి పోవాలంటే క్రీడలు ఒక్కటే సరైన పరిష్కారం. క్రీడాకారులుగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. చదువు కూడా చక్కగా వస్తుంది. అలాగే జాబ్ కూడా సంపాదించుకోవచ్చు” అని మంత్రి రోజా చెప్పారు.
Also Read : మేము అధికారంలోకి రాగానే దీనిపైనే తొలి విచారణ జరిపిస్తాం: పవన్ కల్యాణ్