Cancer Cases : బలభద్రపురంలో క్యాన్సర్ కేసుల కలకలం- మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు
అనపర్తి నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుంటే లక్షా 19వేల మందికి స్క్రీనింగ్ చేయగా 736 సస్పెక్టెడ్ కేసులు వచ్చాయి.

Cancer Cases : తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో క్యాన్సర్ కేసుల కలకలంపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. బలభద్రపురంలో అత్యధిక క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని అనపర్తి ఎమ్మెల్యే అసెంబ్లీలో పేర్కొన్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దీంతో వెంటనే 31 మెడికల్ టీమ్ లను అక్కడికి పంపామన్నారు.
నాన్ కమ్యూనకబుల్ 3.0 సర్వేలో భాగంగా నాన్ కమ్యూనకబుల్ డిసిజ్ క్యాన్సర్ స్క్రీనింగ్ మొదలు పెట్టామని వెల్లడించారు. ఇప్పటివరకు కోటి 93 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించగా వీరిలో లక్ష 45వేల 649 మంది వేర్వేరు క్యాన్సర్లతో భాదపడుతున్న అనుమానిత కేసులు వచ్చాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు.
Also Read : మాజీ మంత్రి విడదల రజినికి ఏసీబీ ఉచ్చు.. అసలు ఈ కేసు ఏంటి? రేపోమాపో ఆమెను అరెస్ట్ చేస్తారా?
”బలభద్రపురానికి సంబంధించి 10800 మంది జనాభాలో 3500 ఇళ్లు ఉన్నాయి. వీరిలో 2803 ఇళ్ల వద్దకు వెళ్లి 8830 మందికి పరీక్షలు చేయగా 38 కేసులు బయటపడ్డాయి. దీనిలో గతంలో క్యాన్సర్ ఉన్న కేసులు ఉన్నాయి. భారత్ లో 14 లక్షల 13 వేల కొత్త కేసులు వచ్చాయి. లక్ష జనాభాకు 367 మంది అంటే 10 వేలు జనాభా ఉన్న బలభద్రపురంలో 32 కేసులు ఉన్నాయి.
అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఆయన అసెంబ్లీలో మాట్లాడటంతో మీడియాలో హైలెట్ అయ్యి అందరికీ తెలిసింది. అనపర్తి నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుంటే లక్షా 19వేల మందికి స్క్రీనింగ్ చేయగా 736 సస్పెక్టెడ్ కేసులు వచ్చాయి. క్యాన్సర్ ట్రీట్ మెంట్ ను 2022-25 మధ్య ఎన్టీఆర్ వైద్య సేవ కింద లక్ష 13 వేల 363 మందికి చికిత్స చేశారు. బలభద్రపురంలో క్యాన్సర్ అనుమానిత కేసులు అసాధారణంగా పెరగలేదు. స్క్రీనింగ్ ట్రైన్డ్ సీహెచ్ సెంటర్లలో ఉండే వారు చేస్తారు. ఆశా వర్కర్లు కాదు” అని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
Also Read : ఎంపీలకు భారీగా వేతనాలు పెంపు.. ఏడాదికి ఒక్కో ఎంపీకి ఎంతొస్తుందంటే..
కృష్ణబాబు- ప్రిన్సిపల్ సెక్రటరీ, వైద్యారోగ్య శాఖ
క్యాన్సర్ ను కన్ ఫామ్ చేయడానికి చేసే పరీక్ష బయాప్సీ మాత్రమే. మిగిలిన పరీక్షలన్నీ రూలౌట్ చేయడానికే. కేజీహెచ్, గుంటూరు, కర్నూలులో క్యాన్సర్ ట్రీట్ మెంట్ సౌకర్యాలు ఉన్నాయి. తొలి స్టేజ్ లో డయాగ్నోజ్ చేస్తే లైఫ్ స్పాన్ ను పెంచుకోవచ్చు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్లు కూడా ఓ టీంను బలభద్రపురం పంపారు. పర్యావరణ అంశాలు క్యాన్సర్ కు కారణం అంటే లంగ్స్, స్కిన్ ఎఫెక్ట్ కావాలి. ఆ తరహా క్యాన్సర్లు అక్కడ డయాగ్నోజ్ కాలేదు. ఇదే అంశంపై సీఎం కూడా రివ్యూ చేశారు.