Seediri appalaraju : 120ఏళ్ల తర్వాత ఇలాంటి విపత్కర పరిస్థితి వచ్చింది, అచ్చెన్నాయుడు వల్లే ఈ దుస్థితి- మంత్రి సీదిరి అప్పలరాజు

టెక్కలి-పలాస నియోజకవర్గ రైతులు కొట్లాడుకునేలా ఆయన మాటలు ఉన్నాయి. అదృష్టవశాత్తూ రెండు రోజుల నుండి వర్షాలు పడుతున్నాయి. Seediri appalaraju - Kinjarapu Atchannaidu

Seediri appalaraju : 120ఏళ్ల తర్వాత ఇలాంటి విపత్కర పరిస్థితి వచ్చింది, అచ్చెన్నాయుడు వల్లే ఈ దుస్థితి- మంత్రి సీదిరి అప్పలరాజు

Seediri appalaraju (Photo : Google)

Updated On : September 8, 2023 / 9:43 PM IST

Seediri appalaraju – Kinjarapu Atchannaidu శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ లో అగ్రికల్చరల్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. మంత్రి సీదిరి అప్పలరాజు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన క్రిష్ణదాస్, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత నెల ఆగస్ట్.. ఈ శతాబ్దంలోనే విపత్కరమైన నెల అని మంత్రి అన్నారు. 120 సంవత్సరాల క్రితం తీవ్ర వర్షాభావం ఏర్పడిందని, ఇప్పుడు ఆగస్టులో అదే పరిస్థితి వచ్చిందని మంత్రి చెప్పారు. రిజర్వాయర్ల నీటి మట్టం కూడా పూర్తిగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఇబ్బందులు పడకూడదని సీఎం జగన్ రెండుసార్లు రివ్యూ చేశారని మంత్రి తెలిపారు.

Also Read..Chandrababu: నన్ను అరెస్టు చేస్తారేమో..! టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

”అదృష్టవశాత్తూ రెండు రోజుల నుండి వర్షాలు పడుతున్నాయి. అచ్చెన్నాయుడికి బ్రెయిన్ సైజ్ ఫుల్.. ఫంక్షనింగ్ నిల్. అచ్చెన్నాయుడి మాటలు రైతుల మధ్య కొట్లాటలు పెట్టేలా ఉన్నాయి. టెక్కలి-పలాస నియోజకవర్గ రైతులు కొట్లాడుకునేలా ఆయన మాటలు ఉన్నాయి. అచ్చెన్న హయాంలో ఎత్తిపోతల పధకాలు ఇష్టానుసారం నిర్మించారు.

లిఫ్ట్ లు ఆన్ చేస్తే పలాస చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. అచ్చెన్నాయుడు లాంటి దౌర్భాగ్యుడి వల్లే జిల్లా వెనుకబడింది. జిల్లాకు ఒక్క మంచి పని, ప్రాజెక్ట్ అయినా చేశారా? మీ ఊరిలో స్కూల్, హాస్పిటల్ సైతం మేమే కట్టించాం. రూల్స్ ప్రకారమే వంశధార నీటి సరఫరా జరుగుతోంది. రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని అచ్చెన్నకు హితవు పలికారు” మంత్రి సీదిరి అప్పలరాజు.

Also Read..Gudivada: కొడాలి నానిని ఓడించాలంటే సరైనోడు ఉండాల్సిందే.. టీడీపీ టిక్కెట్ ఎవరికి!