MLA Roja : ఎమ్మెల్యే రోజాకు తప్పిన ప్రమాదం
చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాకు పెద్ద ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తిరుపతిలో దిగాల్సిన విమానం బెంగళూరులో ల్యాండైంది

Mla Roja
MLA Roja : చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాకు పెద్ద ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తిరుపతిలో దిగాల్సిన విమానం బెంగళూరులో సురక్షితంగా ల్యాండైంది. రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్తున్న ఇండిగో విమానంకు ల్యాండింగ్ సమస్య ఏర్పడింది. దాదాపు గంటపాటు ఈ విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. అనంతరం ఫైలెట్ విమానాన్ని బెంగళూరు ఎయిర్పోర్ట్‌లో ల్యాండ్ చేశారు .
చదవండి : MLA Roja : ఎమ్మెల్యే రోజాకు తప్పిన ప్రమాదం
కాగా ఈ విమానం నగరి ఎమ్మెల్యే రోజాతోపాటు, టీడీపీ సీనియర్ నేతలు యనమల, టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఉన్నారు. అయితే వాతావరణ సమస్య వలన ఇలా జరిగిందా లేదంటే సాంకేతిక సమస్య ఏర్పడిందా అనే దానిపై స్పష్టత రాలేదు. విమానం సేఫ్‌గా ల్యాండ్ అవడంతో ఊపిరిపీల్చుకున్నారు ప్రయాణికులు. అయితే ఇండోగో సంస్థ ప్రయాణికులను తరలించేందుకు ఏర్పాట్లు చేయకపోవడంతో మండిపడుతున్నారు. సొంత ఖర్చులతో తమ గమ్యస్థానాలకు పయనమయ్యారు.
చదవండి : MLA Roja : కుప్పం ఎన్నికల్లో తుప్పు, పప్పులను తరిమికొడతారు : రోజా