Amanchi Krishna Mohan : పోలీసులతో చంద్రబాబు కేసులు పెట్టించారు.. అప్పుడు నేను టీడీపీలోనే ఉన్నా

తనతో పాటు రోజు కూలి చేసుకునే వాళ్ళు కూడా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని వెల్లడించారు. నేడు సీఐడీ కేసులు పెడుతుందని మాట్లాడుతున్న చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు.

Amanchi Krishna Mohan : పోలీసులతో చంద్రబాబు కేసులు పెట్టించారు.. అప్పుడు నేను టీడీపీలోనే ఉన్నా

Amanchi Krishnamohan Angry Chandrababu

Updated On : August 4, 2023 / 8:17 PM IST

Amanchi Krishna Mohan Angry Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుపై చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసుల చేత కేసులు పెట్టించిన చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. ఫిర్యాదు చేయడానికి ఎవరూ రాకపోతే పోలీసుల చేత కేసులు పెట్టించారని పేర్కొన్నారు. తనపై కేసులు పెట్టిన సమయంలో తాను టీడీపీలోనే ఉన్నానని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు.

2018లో లాకప్ డెత్ లో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేస్తే అప్పుడు ఆరు కేసులు పెట్టారని వెల్లడించారు. మూడు కేసులు కొట్టి వేశారని చెప్పారు. చీరాల కోర్టులో మరో రెండు కేసులు ఉన్నాయని చెప్పారు. ఒంగోలులో ఒక కేసు కొట్టి వేశారని పేర్కొన్నారు. అక్రమ కేసుల వల్ల తమ సమయం వృధా అవుతుందన్నారు.

Jennifer Larson: టీటీడీలో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ స్పందన

తనతో పాటు రోజు కూలి చేసుకునే వాళ్ళు కూడా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని వెల్లడించారు. నేడు సీఐడీ కేసులు పెడుతుందని మాట్లాడుతున్న చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. తమ పార్టీ నేతలైనా అణిగిమనిగి ఉంటే చంద్రబాబు బాగానే చూస్తారని కానీ, ప్రశ్నిస్తే మాత్రం కేసులు పెట్టి బయపెడతారని ఆరోపించారు.

జన్మభూమి కమిటీలే చంద్రబాబుకి ఊరితాళ్ళుగా మారాయని పేర్కొన్నారు. ప్రోటోకాల్ కి భిన్నంగా జన్మభూమి కమిటీ సభ నిర్వహిస్తే తాను అడ్డుకున్నానని తెలిపారు. తన వల్ల మొత్తం ప్రోగ్రాంను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. భవిష్యత్ లో చంద్రబాబుకు అధికారం రాదని స్పష్టం చేశారు.