Anagani Satya Prasad : సస్యశ్యామలంగా ఉండే కృష్ణా డెల్టా ప్రాంతం వైసీపీ పాలనలో ఎడారిగా మారింది : ఎమ్మెల్యే అనగాని

ప్రభుత్వ చేతకానితనం వల్ల పంట పొలాలకు నీరు అందక రేపల్లె నియోజకవర్గంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని తెలిపారు.

Anagani Satya Prasad : సస్యశ్యామలంగా ఉండే కృష్ణా డెల్టా ప్రాంతం వైసీపీ పాలనలో ఎడారిగా మారింది : ఎమ్మెల్యే అనగాని

Anagani Satya Prasad

Updated On : October 13, 2023 / 10:17 AM IST

Anagani Satya Prasad – YCP Government : వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శలు చేశారు. ప్రభుత్వ పాలనా విధానాన్ని ఎండగట్టారు. పచ్చని పంటలతో సస్యశ్యామలంగా ఉండే కృష్ణా డెల్టా ప్రాంతం వైసీపీ పాలనలో ఎడారిని తలపిస్తోంని విమర్శించారు. సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. అన్నదాతలను ఆదుకోలేని ప్రభుత్వం ఉంటే ఎంత లేకుంటే ఎంత? అని అన్నారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు.
ప్రభుత్వం స్పందించకుంటే నాగలిని శిలువగా మోస్తూ రైతుల పక్షాన పోరాటానికి శ్రీకారం చుట్టి తక్షణమే పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. వ్యవసాయానికి నీరే ప్రాణాధారం, అలాంటి నీటిని అందించలేని ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. కృష్ణా నదీ జలాల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.

Rajeev Kanakala : చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ మౌనం ఎందుకు.. స్పందించిన రాజీవ్ కనకాల..

సాగునీటి కాలువల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం చెందడంతో రైతులు బలవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ చేతకానితనం వల్ల పంట పొలాలకు నీరు అందక రేపల్లె నియోజకవర్గంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని తెలిపారు. నీళ్లు లేక నిజాపట్నం, రేపల్లె, నగరంపాలెం మండలాల్లో పంటలు ఎండిపోతున్నాయని వెల్లడించారు.