YS Jagan: పలువురు ఎమ్మెల్యేలతో జగన్ కీలక భేటీ.. ఎందుకంటే?

తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి కూడా వచ్చారు.

YS Jagan: పలువురు ఎమ్మెల్యేలతో జగన్ కీలక భేటీ.. ఎందుకంటే?

YS Jagan

Updated On : February 2, 2024 / 5:14 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కలిశారు. నరసారావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నెల్లూరు సిటీ అసెంబ్లీ ఇన్‌చార్జి ఎంపికపై జగన్ చర్చిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో పలు అసెంబ్లీ ఇన్‌చార్జిల నియామకంపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు.

మరోవైపు, మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలకు సీఎం జగన్ నుంచి పిలుపు వచ్చింది. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అక్కడకు వెళ్లారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి కూడా వచ్చారు. అన్నా రాంబాబు, నాగార్జున రెడ్డితో జగన్ చర్చిస్తున్నారు.

ఏపీ ఎన్నికల వేళ ఎమ్మెల్యేల స్థానాల మార్పులు, చేర్పులతో సిట్టింగ్‌లకు స్థానచలనం కల్పిస్తోంది వైసీపీ హైకమాండ్‌. పలువురు నేతల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఆశ్చర్యానికి గురిచేసేలా ఉన్నాయి. అనిల్‌ కుమార్‌ యాదవ్‌ను ఈసారి నరసరావుపేట లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దించాలని నిర్ణయించడంతో ఇక ఇన్‌చార్జి నియామకం ఆసక్తికరంగా మారింది.

Bandi Sanjay: ఇవాళ ఫిబ్రవరి 2 అని గుర్తుచేస్తూ బండి సంజయ్ ఆగ్రహం.. ఎందుకంటే?