MLC Elections: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. ప్రధాన పోటీ వారి మధ్యే..

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు కొనసాగుతుంది.

MLC Elections: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. ప్రధాన పోటీ వారి మధ్యే..

MLC elections Polling

Updated On : February 27, 2025 / 8:34 AM IST

MLC Elections: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు కొనసాగుతుంది. ఏపీలో రెండు పట్టభద్రులు, ఒక ఉపాధ్యాయ నియోజకవర్గానికి పోలింగ్ జరుగుతుండగా.. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతుంది.  ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణకు అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మార్చి 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Also Read: Telangana MLC elections: గెలిచి తీరాల్సిందేనని కాంగ్రెస్ ప్రయత్నాలు.. గట్టి పోటీ ఇస్తున్న ప్రత్యర్థులు వీరే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు పట్టభద్రులు, ఒక ఉపాధ్యాయ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ, ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతుంది. 16 జిల్లాల పరిధిలోని 1,062 కేంద్రాల్లో ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో 70 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 6,84,593మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ ముగిసే సమయానికి కేంద్రం లోపల క్యూలైన్ లో ఉన్నవారందరికి ఓటేసే అవకాశం కల్పిస్తారు. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది.

 

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో ప్రముఖంగా యూటీఎఫ్ నుంచి కోరెడ్ల విజయగౌరి, ఏపీటీఎఫ్ నుంచి పాకలపాటి రఘువర్మ, పీఆర్టీయూ నుంచి గాదె శ్రీనివాసులునాయుడు పోటీలో ఉన్నారు. ఈ స్థానంలో 22,493 మంది టీచర్లు ఓటర్లుగా ఉన్నారు.  ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి 35 మంది పోటీలో ఉన్నారు. టీడీపీ, పీడీఎఫ్ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నడుస్తోంది. అయితే, ఇక్కడ 3,14,984 మంది ఓటర్లు ఉన్నారు. ఇక ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 25 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే, టీడీపీ, పీడీఎఫ్ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ ఉంది. టీడీపీ నుంచి ఆలపాటి రాజా బరిలో నిలవగా.. పీడీఎఫ్ నుంచి కేఎస్ లక్ష్మణరావు పోటీ ఉన్నారు. ఈ స్థానంలో 3,47,116 మంది పట్టభద్రులు ఓటర్లుగా ఉన్నారు.

 

తెలంగాణ రాష్ట్రంలో..
తెలంగాణలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంకు పోలింగ్ జరుగుతుంది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానంకు మొత్తం 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 3,55,159 మంది ఓటర్లు ఉన్నారు. అయితే, ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ నడుస్తోంది. కాంగ్రెస్ నుంచి వి. నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి అంజిరెడ్డి బరిలో ఉన్నారు. కరీంనగర్ – మెదక్ – నిజామాబాద్ – అదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో 15మంది పోటీలో ఉన్నారు. 42అసెంబ్లీ స్థానాల పరిధిలో జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ స్థానంలో 27,088 మంది టీచర్లు ఓటర్లుగా ఉన్నారు. నల్గొండ – ఖమ్మం – వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి 19మంది అబ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 25,797 మంది ఓటర్లు ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు 200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.