ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.. కరోనా పాజటివ్ కేసులు భారీగా నమోదవుతూనే ఉన్నాయి. మొన్నటివరకూ తగ్గినా ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.. ఏపీలో గత 24 గంటల్లో 61,838 శాంపిల్స్ పరీక్షించారు.. వీరిలో 10,830 మంది కరోనా పాజిటివ్ అని తేలింది.. కోవిడ్ సోకిన వారిలో తూర్పుగోదావరిలో 11మంది మరణించారు.
ప్రకాశంలో 9మంది, చిత్తూరులో ఎనిమిది మంది, కడపలో 8మంది, అనంతపూర్‌లో ఆరుగురు, పశ్చిమ గోదావరిలో ఆరుగురు, కృష్ణలో ఐదుగురు, కర్నూలులో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు మరణించారు.
గుంటూరులో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు మరణించారు. గడిచిన 24 గంటల్లో 8,473 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చారి అయి వెళ్లారు.. రాష్ట్రంలో 34,18,690 శాంపిల్స్ పరీక్షించారు..