వంగవీటి రంగాను కత్తితో పొడిచింది వెలగపూడే: విజయసాయిరెడ్డి

వంగవీటి రంగాను కత్తితో పొడిచింది వెలగపూడే: విజయసాయిరెడ్డి

Updated On : January 1, 2021 / 8:21 PM IST

తెలుగుదేశం పార్టీ నాయకులు, విశాఖ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వంగవీటి రంగా హత్య కేసులో వెలగపూడి నిందితుడంటూ ఆరోపించారు విజయసాయిరెడ్డి. రాగమాలిక సీడీషాప్‌ను అడ్డుపెట్టుకుని రంగా హత్యకు ప్లాన్‌ చేశారంటూ చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి.

రంగాను కత్తితో పొడిచి హత్య చేసిన వాళ్లలో వెలగపూడి ఒకరని, వెలగపూడిని మొదట రాగమాలిక రామకృష్ణ అనేవారని, వెలగపూడి రామకృష్ణ కాపీ కొట్టి ఇంటర్‌ పరీక్షలు రాసిన వ్యక్తియని, ఒక విశ్వవిద్యాలయం నుంచి పట్టా కొనుగోలు చేశారని, త్వరలోనే వెలగపూడి విద్యార్హతపై కేసు పెడతామని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. వెలగపూడికి హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో కమర్షియల్‌ కాంప్లెక్స్‌, ఇళ్లు ఉన్నాయని, విశాఖలో కూడా బినామీ పేర్లతో ఇళ్లు ఉన్నాయని ఆరోపించారు.

‘‘బైరెడ్డి పోతన్నరెడ్డి, కాళ్ల శంకర్‌, పట్టాభి, రాజేంద్రకుమార్‌, సతీష్‌.. వెలగపూడి బినామీలు అని, విశాఖలో వెలగపూడి లిక్కర్‌ సిండికేట్‌ అక్రమాలకు పాల్పడ్డారని, దేవినేని బాజీ పేరుతో కబడ్డీ పోటీలు నిర్వహించి కలెక్షన్లు చేసిన వ్యక్తి వెలగపూడిపై విమర్శలు గుప్పించారు విజయసాయిరెడ్డి. వెలగపూడి యువజన పేరుతో ఆరిలోవలో వెలగపూడి అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి.